
బిగ్‌బాస్ షో పోటీదారులు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటారు.

అక్రమంగా బాలికను ఇంట్లో పెట్టుకున్నందుకు బిగ్‌బాస్ పోటీదారు, నటి సోను శ్రీనివాసగౌడను బెంగళూరు నగర బ్యాడరహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉత్తర కర్ణాటకకు చెందిన 8 ఏళ్ల సేవంతి అనే బాలికను తాను దత్తత తీసుకున్నట్లు సోను సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకుంది.

ఆ బాలికతో సరదాగా ఉన్న వీడియోలను కూడా పోస్ట్ చేసింది. దత్తత తీసుకున్నట్లు బహిరంగంగా చెప్పడం చట్టం ప్రకారం నేరం.

బాలికకు భోజనం పెట్టడం, ముక్కు పుడక వేయడం కోసం ముక్కుకు రంధ్రం వేయడం తదితర వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిందామె.

ఇంటి వద్ద కుక్కలకు బిస్కెట్లు వేస్తుండగా సేవంతి పరిచయమైందని, చట్ట ప్రకారం దత్తత తీసుకున్నట్లు తెలిపింది.

దీనిపై ఎవరైనా ట్రోల్ చేస్తే కేసులు పెడతానని వీక్షకులను హెచ్చరించింది.

ఆమె హంగామా గురించి శిశు సంక్షేమ శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం బ్యాడరహళ్లి పోలీసులు ఇంటికి చేరుకుని సోనుగౌడను అరెస్ట్ చేశారు.

బాలికను శిశుమందిరకు తరలించారు. ఆమె నిజంగా దత్తత తీసుకున్నారా, బాలిక తల్లిదండ్రులు ఎవరు అనేది విచారణ చేపట్టారు.

టీవల మాల్దీవులలో పర్యటించిన సోనుగౌడ బికిని ధరించిన వీడియో వైరల్‌గా మారింది.

ఆమెకు ఇన్‌స్టాలో 10 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆమె ఎప్పుడూ వీడియోలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది.













