
హీరో వెంకటేష్ భార్యగా ‘ఐశ్వర్య రాజేష్’

విక్టరీ వెంకటేష్ ఇప్పుడు అనిల్ రావిపూడితో సినిమాను చేయబోతున్నారు

ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది

ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్‌ను చిత్ర యూనిట్ ఎంపిక చేసింది

ఇందులో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, ఆయన ప్రియురాలి పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనున్నారని ముందే అనిల్ రివీల్ చేశాడు.

మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, ఆ పోలీసాఫీసర్ మాజీ ప్రేయసి... ఈ మూడు ప్రధాన పాత్రల నేపథ్యంలో సాగే క్రైమ్ ఎంటర్‌టైనర్ మూవీ అని ఆయన అన్నాడు.

ఈ నెల 3 నుంచి ఈ ప్రాజెక్ట్ చిత్రీకరణ ప్రారంభించి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్లు అనిల్ రావిపూడి తెలిపారు.















