
సింగపట్నం లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది. వేలాది భక్తజనం నడుమ స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ప్రధాన రహదారి వెంట ఊరేగించారు.

నమో నారసింహా నామస్మరణ మార్మోగింది

ఆలయ ప్రధాన అర్చకుడు ఓరుగంటి సంపత్‌కుమార్‌శర్మ పర్యవేక్షణలో స్వామివారి రథోత్సవం శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా కొనసాగింది

లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం సందర్భంగా సింగపట్నం భక్తులతో కిక్కిరిసింది

భక్తజనంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలొచ్చిన భక్తులు.. గుండంలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారి దర్శనానికి క్యూకట్టారు











