
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా కోనసాగుతున్నాయి

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రోజున యోగ లక్ష్మీ నరసింహ స్వామి తెప్పోత్సవం మరియు డోలోత్సవం ఘనంగా నిర్వహించారు

సాయంత్రం వేళలో యోగ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవమూర్తిని వేద బ్రాహ్మణులు మంత్రోచ్ఛారణల మధ్య మంగళ వాయిద్యాలు తో ఆలయం నుండి బ్రహ్మ పుష్కరిణి వరకు ఊరేగింపు నిర్వహించారు

అనంతరం బ్రహ్మపుష్కరిణిలో హంస వాహనంపై స్వామివారిని ఆసీనులను చేసి తెప్పోత్సవం నిర్వహించారు

బ్రహ్మపుష్కరిణిలో గల మండపంలోని పల్లకిలోకి స్వామి వారిని తీసుకెళ్లి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు

ప్రభుత్వ విప్ ఎమ్మేల్యే అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ ,భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు












