
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాల్లో చివరి ఘట్టమైన రథోత్సవం అశేష భక్తజనం మధ్య అత్యంత వైభవోపేతంగా జరిగింది

బుధవారం సాయంత్రం అమ్మవారి రథానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేసి, గుమ్మడి కాయతో దిష్టి తీసి ఊరేగింపును ప్రారంభించారు

అమ్మవారిని బల్కంపేట పురవీధుల్లో ఊరేగించారు

వేలాదిగా తరలివచ్చిన భక్తులు రథాన్ని లాగి ఎల్లమ్మను దర్శించుకున్నారు

కోలాటం, సంప్రదాయ నృత్యాలు, పోతరాజులు, శివసత్తుల విన్యాసాలు అలరించాయి









