breaking news
-
funday rss check
vfunday rss check -
ప్రశాంతంగా కాలం గడిచిపోతుండగా.. ఒకనాడు..
శ్రీరామ పట్టాభిషేకం తర్వాత కొన్నాళ్లకు ఆంజనేయుడు రాముని వద్ద సెలవు తీసుకుని, తపస్సు చేసుకోవడానికి గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుని, నిరంతరం తపస్సు కొనసాగించేవాడు. సముద్రాన్ని లంఘించి, లంకకు వెళ్లి అక్కడ సీతమ్మవారిని చూడటమే కాకుండా, రావణుడి ఆజ్ఞపై రాక్షసులు తోకకు నిప్పంటిస్తే లంకను తగులబెట్టి మరీ తిరిగి వచ్చిన వైనం సహా రామ రావణ యుద్ధంలో హనుమంతుని సాహసాలను జనాలు కథలు కథలుగా చెప్పుకొనేవారు. అయోధ్యవాసులకే కాదు, రామరాజ్యం అంతటా జనాలకు శ్రీరాముడితో పాటు ఆంజనేయుడు కూడా ఆరాధ్యుడయ్యాడు. గంధమాదన పర్వతం మీద నిర్మించుకున్న ఆంజనేయుడి ఆశ్రమం తాపసులకు ఆశ్రయంగా ఉండేది. ఆశ్రమంలో ప్రతిరోజూ వేదపఠనం సాగేది. తాత్త్విక చర్చలు సాగుతుండేవి. ప్రశాంతంగా కాలం గడిచిపోతుండగా, ఒకనాడు ఆంజనేయుడికి శ్రీరాముడిని దర్శించుకోవాలని కోరిక పుట్టింది. వెంటనే తన ఒంటె వాహనం మీద అయోధ్య నగరానికి బయలుదేరాడు. జానకీ సమేతుడైన శ్రీరాముడిని దర్శించుకుని, పరిపరి విధాలుగా స్తుతిస్తూ ప్రణమిల్లాడు. శ్రీరాముడు ఆంజనేయుడిని ఆలింగనం చేసుకుని, ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు. ‘ఇక్కడి నుంచి గంధమాదనానికి వెళ్లిపోయాక చాన్నాళ్లకు వచ్చావు. నీ రాక నాకే కాదు, సీతకు కూడా ఆనందదాయకమే! నువ్వు ఉంటున్న చోటు సౌకర్యంగానే ఉందా? ఆశ్రమవాసంలో అంతా కుశలమే కదా?’ అంటూ కుశలప్రశ్నలు వేశాడు. ‘రామా! నీ దయ నిరంతరం నా మీద ఉండగా నాకు చింత ఏమిటి? క్షేమంగానే ఉన్నాను స్వామీ!’ అని బదులిచ్చాడు ఆంజనేయుడు. ‘హనుమా! సీతాన్వేషణ మొదలుకొని రావణుడితో యుద్ధం వరకు నాకు ఎన్నో రకాలుగా తోడుగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు నాకు మరొక పని చేసిపెట్టాలి’ అన్నాడు రాముడు. ‘ఆజ్ఞాపించు ప్రభూ! నీ ఆజ్ఞను నెరవేర్చడమే నా కర్తవ్యం’ చేతులు జోడించి అన్నాడు హనుమంతుడు. ‘నా అంగుళీయకాన్ని అడిగితే దానిని బ్రహ్మదేవుడికి ఇచ్చాను. లంకలో ఉన్నప్పుడు సీత ఆ ఉంగరాన్ని చూసుకుంటూ తన దుఃఖాన్ని తీర్చుకునేది. ఇప్పుడు ఆ ఉంగరం కావాలి. నువ్వు వెంటనే సత్యలోకానికి వెళ్లి, ఆ ఉంగరాన్ని తెచ్చి ఇవ్వు’ అన్నాడు రాముడు. శ్రీరాముడి మాట పూర్తికావడమే తడవుగా ఆంజనేయుడు రివ్వున ఆకాశానికి ఎగిరాడు. వాయువేగ మనోవేగాలతో నేరుగా సత్యలోకానికి చేరుకున్నాడు. సత్యలోకంలో బ్రహ్మదేవుడి కొలువు నిండుగా ఉంది. అష్టదిక్పాలకులు, సనక సనందాది మహామునులు అక్కడ ఉన్నారు. ఆంజనేయుని చూడగానే వారందరూ లేచి నమస్కరించి, అతడిని ఉచితాసనంపై కూర్చుండబెట్టారు. సభలోకి బ్రహ్మదేవుడు అడుగుపెట్టాడు. సభాసదులందరూ ఆయనకు నమస్కరించారు. ఆంజనేయుడు కూడా లేచి నిలుచుని బ్రహ్మదేవుడికి నమస్కరించాడు. ‘దేవా! మా శ్రీరామచంద్రుడు తన రత్నఖచిత కనక అంగుళీయకాన్ని నీకు ఇచ్చాడట. ఆ ముద్రికను తీసుకు రమ్మని నన్ను ఇక్కడకు పంపాడు. ఆ ముద్రికను వెంటనే ఇచ్చేస్తే, నేను దానిని తీసుకువెళ్లి నా ప్రభువుకు అందిస్తాను’ అన్నాడు. ‘ఇది సత్యలోకం. ఇక్కడ ఒకసారి ఇచ్చినది ఏదైనా తిరిగి ఇవ్వడానికి వీలుపడదు’ అని పలికాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి మాటలకు ఆంజనేయుడికి కోపం వచ్చింది. ‘బ్రహ్మదేవా! బొత్తిగా కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నావు. నాకు ఇక్కడ ఆలస్యం చేయడానికి వీలుపడదు. నువ్వు ఇవ్వకుంటే, ఈ సత్యలోకాన్నే పెళ్లగించుకుని పోయి నా ప్రభువు పాదాల ముందు ఉంచుతాను’ అంటూ తన దేహాన్ని విపరీతంగా పెంచి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. సత్యలోకంలో ఉన్నవారంతా ఆంజనేయుని భీకర విశ్వరూపాన్ని చూసి హాహాకారాలు చేశారు. ఇంతలో సనక మహర్షి కల్పించుకుని, ‘బ్రహ్మదేవా! రామదూత ఆంజనేయుడి బలవిజృంభణను చూశావు కదా! పరిస్థితి అదుపు తప్పక ముందే ఆ ముద్రికను అతడికి ఇచ్చి పంపడమే మంచిది’ అని పలికాడు. అప్పుడు బ్రహ్మదేవుడు పక్కనే తామరలతో నిండి ఉన్న కొలనను చూపించి, ‘ఆ ముద్రిక అందులోనే ఉంది. తీసుకువెళ్లు’ అన్నాడు. హనుమంతుడు కొలనులోకి చూస్తే, నీటి అడుగున అసంఖ్యాకంగా రామ ముద్రికలు కనిపించాయి. అన్నిటినీ తీసుకువెళ్లడానికి రామాజ్ఞ లేదు. ఏం చేయాలో తోచక ఆంజనేయుడు రిక్తహస్తాలతోనే అయోధ్యకు చేరుకుని, రాముడికి జరిగిన సంగతంతా చెప్పాడు. ‘హనుమా! ఆ సరస్సున ఉన్నవి నా అంగుళీయకానికి బింబ ప్రతిబింబాలే! వాటి మహిమతోనే బ్రహ్మదేవుడు సత్యలోకాన్ని సకలలోక సమ్మతంగా పరిపాలిస్తున్నాడు. వాటిలో ఒకటి తీసుకురా’ అని చెప్పాడు. హనుమంతుడు వెంటనే మళ్లీ సత్యలోకానికి వెళ్లి సరస్సులో ఉన్న ముద్రికల్లో ఒకదానికి తీసుకువచ్చి, రాముడికి అందజేశాడు. రాముడు సంతోషించి, ‘హనుమా! భవిష్యత్తులో నువ్వే సత్యలోకాధిపత్యం పొంది భవిష్యద్బ్రహ్మవై వర్ధిల్లగలవు’ అని ఆశీర్వదించాడు. — సాంఖ్యాయన ఇవి చదవండి: బౌద్ధవాణి: నిద్రకు దూరం చేసే పనులు.. -
సెలబ్రిటీ శారీ డ్రేపర్: ఎంత చార్జ్ చేస్తుందో తెలుసా..!
సెలబ్రిటీలకు స్టయిల్ని అద్ది.. వాళ్లను ఫ్యాషన్ స్టార్స్‌గా తీర్చిదిద్దే స్టయిలిస్ట్‌లు ఉంటారు. ముఖ్యంగా చీర కట్టు అనేది ఎప్పటికీ స్పెషల్. దీన్ని ప్రోషెషన్గా ఎంచుకుని సినీ సెలబ్రిటీలకు కట్టే స్థాయికి వెళ్లింది స్టార్ స్టయిలిస్ట్ డాలీ జైన్. ఆమె ఎలా శారీ డ్రేపర్‌గా మారిందో తెలుసుకుందామా..! ‘ఆరు గజాల ప్రతి చీరా నాకు 360 రకాల కట్టుతీరుల్ని, కుచ్చిళ్లను పరిచయం చేస్తున్నట్టనిపిస్తుంది’ అంటుందీ చీరకట్టు స్పెషలిస్ట్. దీపికా పదుకోణ్, ఆలియా భట్, ప్రియంకా చోప్రా, కరిష్మా కపూర్, సోనమ్ కపూర్, నీతా అంబానీ, ఈషా అంబానీ, శ్లోకా అంబానీ, రవీనా టండన్ వంటి సెలబ్రిటీలందరూ ఏ చిన్న ఫంక్షన్‌కి అటెండ్ కావాలన్నా డాలీ జైన్‌కి కబురు పెడతారు. ఆమె చేత చీర కట్టించుకుంటారు. అంతలా చీరకట్టును ఓ ప్రొఫెషన్ స్థాయికి తీసుకెళ్లిన డాలీ.. పెళ్లయిన కొత్తలో చీరంటే యమ చిరాకు పడేదట. బెంగళూరులో పుట్టిపెరిగిన ఆమె పెళ్లయ్యే వరకు జీన్స్.. టీ షర్ట్స్, కుర్తీలే ధరించేది. కానీ అత్తారింట్లో క్యాజువల్ వేర్ నుంచి అకేషనల్ వేర్ దాకా అన్నిటికీ చీరే మస్ట్ అని ఆమె సాసుమా ఆర్డర్ పాస్ చేశారు. తప్పక చీరకట్టుతో కుస్తీపట్టడం మొదలుపెట్టింది డాలీ. రోజూ ముప్పావు గంట పట్టేదట చీర కట్టుకునేసరికి. ఇప్పుడు రికార్డ్ రేంజ్లో 18.5 సెకన్లలో కట్టేస్తుంది.. కట్టిస్తుంది. ప్రొఫెషన్‌గా ఎలా మారింది? కారణం సినీతార శ్రీదేవే అనే ఆన్సర్ ఇస్తుంది డాలీ. చీరే కట్టుకోవాలి అని రూల్ పెట్టిన అత్తగారు.. కోడలు పడుతున్న అవస్థ చూసి జాలిపడి ‘కుర్తీలు వేసుకో’ అంటూ నియమాన్ని సడలించింది. అయితే అప్పటికే డాలీకి చీర మీద మోజు మొదలైంది. సో.. చీరనే కంటిన్యూ చేసింది. ఇంట్లో.. ఇరుగుపొరుగు.. బంధువుల్లో ఏ శుభకార్యం జరిగినా చీరకట్టడంలో అతివలకు సాయపడటమూ స్టార్ట్ చేసింది. అలాంటి ఒక సందర్భంలో ఆమె మేనమామ ఒక పార్టీ ఇచ్చాడు. అతను సినీతార శ్రీదేవి ఉండే అపార్ట్మెంట్లోనే ఉండేవాడట. అందుకని శ్రీదేవినీ ఆహ్వానించాడు. డాలీ కూడా వెళ్లింది. పార్టీలో శ్రీదేవి చీర మీద జ్యూస్ ఒలికిందట. ఆమె ఇబ్బందిపడుతుంటే డాలీ చొరవ తీసుకుని గబగబా మేనమామ భార్య చీరొకటి తెచ్చి.. శ్రీదేవికి ఇచ్చిందట. అంతేకాదు ఆమె చీరకట్టుకుంటూంటే.. కుచ్చిళ్లు పెట్టడంలో.. పల్లూ సెట్ చేయడంలో సహాయపడిందట కూడా. డాలీ చీరకట్టే నేర్పరితనానికి శ్రీదేవి అబ్బురపడుతూ ‘ఇన్నేళ్లుగా చీర కట్టుకుంటున్నాను.. ఇంతబాగా కుదిరిందిలేదెప్పుడూ! దీన్ని ఒక ప్రొఫెషన్‌గా తీసుకోవచ్చుగా?’ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చిందట. ఆలస్యం లేకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇదిగో ఇలా ఫేమస్ అయింది డాలీ. వందల్లోంచి లక్షల్లోకి... దాదాపు 20 ఏళ్లుగా శారీ డ్రేపర్ ప్రొఫెషన్లో కొనసాగుతూన్న డాలీ జైన్.. తొలి పారితోషికం రూ. 250. ఇప్పుడు 2 లక్షల రూపాయల వరకు చార్జ్ చేస్తుంది. ఆమె దగ్గర 20 మంది సభ్యులతో కూడిన టీమ్ ఉంటుంది. చీరనే కాదు.. హాఫ్ శారీ, దుపట్టా.. ఇలా అన్నిటినీ సెట్ చేస్తుంది. ఈ స్టయిలింగ్‌లో ట్రైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీలేం లేవు ఆమెకు. కేవలం చీర కట్టు మీద తనకున్న మమకారం.. సృజనతోనే ఈ స్థాయికి ఎదిగింది. తనలాంటి గృహిణులు ఎందరికో స్ఫూర్తిని పంచుతోంది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ? డాలీ జైన్ టాలెంట్ ఫ్యాషన్ డిజైన్ సందీప్ ఖోస్లా దృష్టిలో పడింది. నీతా అంబానీ 50 వ పుట్టిన రోజు ఫంక్షన్లో ఆమెకు చీర కట్టేందుకు డాలీని రికమెండ్ చేశాడు అతను. ఆ వేడుకలో మరెందరో సెలబ్రిటీల దృష్టిలోపడి బాలీవుడ్ ప్రవేశాన్ని సాధించింది. ఆమె ఫస్ట్ బాలీవుడ్ సెలబ్రిటీ వేడుక.. సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ వెడ్డింగ్. అక్కణ్ణించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఎందరికో డాలీ ఫేవరేట్ శారీ డ్రేపర్ అయిపోయింది. -
బిస్కెట్ జాత్రా..!: ఇదేం జాతర రా నాయనా..!
నేపాలీల కొత్త సంవత్సరం మేష సంక్రమణం రోజున జరుగుతుంది. ఇదేరోజు కఠ్మాండు సమీపంలోని భక్తపూర్లో ‘బిస్కెట్ జాత్రా’ వేడుకలు జరుగుతాయి. నిజానికి ఈ జాతర పేరు ‘బిస్కా జాత్రా’ అయినా, కాలక్రమంలో ‘బిస్కెట్ జాత్రా’గా జనాల్లో స్థిరపడింది. భక్తపూర్లో ఏటా ఈ జాతర జరుపుకోవడం వెనుక ఒక స్థలపురాణగాథ ప్రచారంలో ఉంది. ఒకానొక కాలంలో భక్తపూర్ ప్రాంతాన్ని లిచ్చవి వంశానికి చెందిన శివదేవ మహారాజు పరిపాలించేవాడు. ఆయన రాజ్యంపై చుట్టుపక్కల అడవుల్లో ఉండే కిరాతులు తరచు దాడులు చేస్తుండేవారు. తన రాజ్యానికి కిరాతుల బెడద లేకుండా చేయాలని కోరుతూ శివదేవ మహారాజు వజ్రయోగినిని ప్రార్థించాడు. కిరాతుల పీడను శేఖర్ ఆచాజు అనే తాంత్రికుడు విరగడ చేయగలడని, అతడి సహాయం తీసుకోమని వజ్రయోగిని సలహా ఇచ్చింది. శివదేవ మహారాజు తన పరివారాన్ని వెంటతీసుకుని శేఖర్ ఆచాజును కలుసుకుని, తన సమస్యను వివరించాడు. శేఖర్ ఆచాజు తన తాంత్రిక శక్తితో పులిగా మారిపోయాడు. తన శిష్యగణాన్ని కూడా పులులుగా మార్చాడు. పులుల గుంపు ఒక్కసారిగా మెరుపుదాడి చేయడంతో కిరాతుల దండు పటాపంచలై, పలాయనం చిత్తగించింది. శివదేవ మహారాజుకు కిరాతుల బెడద విరగడైంది. కిరాతులను తరిమికొట్టిన శేఖర్ ఆచాజును శివదేవ మహారాజు తన రాజ్యంలోని తిమి పట్టణానికి ఆహ్వానించి, సిందూరపు జల్లులతో ఘనస్వాగతం పలికాడు. ఈ సంఘటన తర్వాత శేఖర్ ఆచాజు శక్తి అతడి భార్య నరరూపకు తెలిసింది. తన ఎదుట ఒకసారి పాముగా మారి చూపించాలని కోరింది. శేఖర్ ఆచాజు ఆమె చేతికి కొన్ని వడ్లగింజలు ఇచ్చి, వాటిని తిరిగి తనపై చల్లితే యథారూపానికి వస్తానని చెప్పాడు. తన మంత్రశక్తితో కొండచిలువగా మారిపోయాడు. కొండచిలువను చూసి నరరూప భయంతో పరుగు తీసింది. తన నడుముకు ఉన్న దట్టీ బిగుతుగా ఉండి అడ్డుపడటంతో దాన్ని వదులు చేసుకోవడానికి భర్త తన చేతికి ఇచ్చిన వడ్ల గింజలను నోట్లో వేసుకుంది. వెంటనే ఆమె కూడా కొండచిలువగా మారిపోయింది. తిరిగి మానవ రూపంలోకి రావాలంటే, ఆ రహస్యం శివదేవ మహారాజుకు మాత్రమే తెలుసు. కొండ చిలువలుగా ఉన్న భార్యా భర్తలిద్దరూ పాకుతూ రాజు అంతఃపురంలోకి వెళ్లారు. ఆచాజు దంపతులే అలా వచ్చారని పోల్చుకోలేని రాజు కొండచిలువలను చంపేయమని భటులను ఆజ్ఞాపించాడు. భటులు వాటిని చంపేశారు. ఇది జరిగిన కొంతకాలానికి శివదేవ మహారాజుకు తన పొరపాటు తెలిసివచ్చింది. అప్పటి నుంచి పాముల రూపంలో మరణించిన ఆచాజు దంపతుల గౌరవార్థం ఏటా మేషసంక్రమణం రోజున ‘బిస్కా జాత్రా’ నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఈ జాతరలో భక్తపూర్ ప్రధాన వీథుల్లో భైరవుడిని, భద్రకాళిని రథాలపై ఊరేగిస్తారు. ఈ సందర్భంగా పట్టణంలోని ‘థానే’ (ఎగువభాగం), ‘కోనే’ దిగువభాగం ప్రజల నడుమ పొడవాటి తాడును గుంజే ‘టగ్ ఆఫ్ వార్’ పోటీ జరుగుతుంది. మరుసటి రోజున ‘సిందూర్ జాత్రా’ జరుగుతుంది. జనాలు ఒకరిపై ఒకరు సిందూరం పూసుకుని, వీథుల్లోకి వచ్చి నృత్యగానాలతో సందడి చేస్తారు. (చదవండి: పిల్లులంటే ఇష్టమా? ఐతే తప్పకుండా ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే..!) -
పిల్లులంటే ఇష్టమా? ఐతే తప్పకుండా ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే..!
ఎన్నో రకాల మ్యూజియంలు చూసుంటారు. ఇలా పిల్లుల కోసం ప్రత్యేకంగా ఉన్న మ్యూజియంని ఇంత వరకు చూసి ఉండరు. మన దేశంలో పిల్లిని పొద్దునే చూడటం అపశకునంగా భావిస్తారు గానీ పాశ్చాత్యులు పెంపుడు జంతువుగా పిల్లిని పెంచుకుంటారు. వాళ్లు ఏకంగా ఈ పిల్లుల కోసం ప్రత్యకంగా మ్యూజియంని ఏర్పాటు చేశారు. మరింత విశేషమేమిటంటే ఆ వ్యూజియంలో పిల్లి మమ్మీలు కూడా ఉంటాయట. ఇంతకీ ఆ మ్యూజియం ఎక్కడ ఉందంటే.. ప్రపంచంలో వింత వింత మ్యూజియంలు ఎన్నో ఉన్నాయి. మలేసియాలోని ఈ పిల్లుల మ్యూజియం కూడా అలాంటిదే! మలేసియాలోని కుచింగ్ నగరంలో ఉందిది. కుచింగ్ నార్త్ సిటీ హాల్ యాజమాన్యంలో దీనిని 1993లో నెలకొల్పారు. ఈ పిల్లుల మ్యూజియంలో పిల్లులకు సంబంధించిన దాదాపు నాలుగువేలకు పైగా కళాఖండాలు, వస్తువులు కొలువుదీరి మార్జాలాభిమానులకు కనువిందు చేస్తాయి. ఇందులో పిల్లులకు చెందిన పెయింటింగ్స్, శిల్పాలు, ఈజిప్టు నుంచి తీసుకువచ్చిన ప్రాచీన మార్జాల మమ్మీ వంటి అరుదైన వస్తువులు, పిల్లులకు సంబంధించిన ప్రకటనలు, అరుదైన జాతుల పిల్లుల చిత్రపటాలు, ఫొటోలు వంటివి అబ్బురపరుస్తాయి. ఈ పిల్లుల కళాఖండాలను తొలిసారిగా 1988లో మలేసియా ఉన్నతాధికారి దివాన్ తున్ అబ్దుల్ రజాక్ ‘పుత్ర వరల్డ్ ట్రేడ్ సెంటర్’లో ప్రదర్శించారు. తర్వాత కుచింగ్ నార్త్ సిటీ హాల్ యాజమాన్యం వీటిని సొంతం చేసుకుని, నార్త్ సిటీ హాల్ దిగువ అంతస్తులో శాశ్వతంగా ఈ పిల్లుల మ్యూజియంను ఏర్పాటు చేసింది. (చదవండి: సీతాకోక చిలుక పాలు గురిచి విన్నారా? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019