విజయనగరం జిల్లా ప్రజల చిరకాల కోరికను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం 70 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పుతున్న విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం తుది దశకు చేరుకుంది. కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లలో అడ్మిషన్లకు నేషనల్ మెడికల్ కమిషన్ ఇప్పటికే అనుమతి ఇచ్చింది.