ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల అభివృద్ధికి పెద్దపీట.. సుమారు ₹2,900 కోట్లతో కృష్ణపట్నం పోర్టుకు కనెక్టివిటీ ప్యాకేజీ 2, 3, 4 జాతీయ రహదారుల నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఏపీలో 2014 నాటికి 4,193 కి.మీ జాతీయ రహదారులు ఉంటే.. 2023 నాటికి అది 8,744 కి.మీకు చేరిందని, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఈ రహదారులు దోహదం చేస్తాయని కేంద్రమంత్రి అన్నారు.