వ్యసనాలకు బానిసై చోరీలు
భీమవరం: వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని భీమవరం టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం టూటౌన్‌పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ ఆర్‌జీ జయసూర్య వివరాలు వెల్లడించారు. రాయలం గ్రామ పరిధిలో అడ్డాల శ్రీనివాసరావు 2013 ఆగస్టు 16వ తేదీన రూ.10 లక్షలు మోటారుసైకిల్ డిక్కీలోపెట్టి ఇంట్లోకి వెళ్లి వచ్చేలోపు నగదును ఇద్దరు వ్యక్తులు అపహరించారు. దీనిపై టూటౌన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. సీఐ జి కాళీచరణ్, ఎస్సై ఇశ్రాయేల్, కానిస్టేబుళ్లు టి శరత్, ఎన్ గోపి, ఆర్ నరేంద్ర దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుడైన నెల్లూరు జిల్లా భోగోలు మండలం కప్పరాలతిప్ప గ్రామానికి చెందిన పీట్ల మహేష్‌ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.3.50 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జయసూర్య వివరించారు. నిందితుడు మహేష్ వ్యసనాలకు బానిసై నగదు కోసం దొంగతనాలు ప్రారంభించాడని, అతడిపై పలు జిల్లాల్లో 11 కేసులు నమోదయ్యాయన్నారు. ఇందులో ఒక సస్పెక్టివ్, రౌడీ షీట్ నెల్లూరు జిల్లా బిట్రగుంట పోలీస్ స్టేషన్లో నమోదైనట్లు డీఎస్పీ చెప్పారు. రాయలం వద్ద జరిగిన చోరీ కేసులో మరో నిందితుడు బెంజిమెన్ పరారీలో ఉన్నాడని డీఎస్పీ తెలిపారు. విలేకర్ల సమావేశంలో ట్రైనీ డీఎస్పీ కె మానస, సీఐ కాళీచరణ్ పాల్గొన్నారు.
నిందితుడి అరెస్ట్.. రూ.3.50 లక్షలు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment