
చిత్రకారుడు వెంపటాపునకు జాతీయ అవార్డులు
తణుకు అర్బన్: ఉత్తరప్రదేశ్ బరెల్లికి చెందిన కళారత్నం ఫౌండేషన్ ఆఫ్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ ఆన్‌లైన్ గ్రూప్ ఆర్ట్ ఎగ్జిబిషన్, కాంపిటీషన్‌లో తణుకుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు రెండు అవార్డులు సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన చిత్రకళా పోటీ, ఎగ్జిబిషన్‌లో వివిధ దేశాల నుంచి వచ్చిన చిత్రకారులు తమ చిత్రకళా రూపాలను ప్రదర్శించారని, ఈ పోటీలో తనకు ఒకేసారి కళా రత్నం, ఆర్టిస్ట్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డులు దక్కడం చాలా సంతోషంగా ఉందని వెంపటాపు అన్నారు. ఈ సందర్భంగా వెంపటాపును పలువురు అభినందించారు.
విదేశాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం
జర్మనీ దేశ ప్రతినిధి బృందం
ద్వారకాతిరుమల: జర్మనీ, యూరప్ దేశాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశం తమ పర్యటన ద్వారా బలపడిందని జర్మనీ దేశ ప్రతినిధి బృందం పేర్కొంది. రైతు సాధికార సంస్థ ‘్ఙఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం’ (ఏపీసీఎన్‌ఎఫ్) ద్వారా అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను జర్మన్ ప్రతినిధి బృందం ఏలూరు జిల్లాలో బుధవారం పర్యటించింది. ఈ సందర్భంగా ‘ఫౌండేషన్ ఆన్ ఫ్యూచర్ ఫార్మింగ్ ’ తరపున బృంద సభ్యులు జాస్పర్ జోర్డాన్, బెన్నెడిక్ట్ హెర్లిన్, పోర్చుగల్‌కు చెందిన ప్రాజెక్టు ఎర్త్ ప్రతినిధి డియోగో కౌటినో, అటెలియర్ ఫుడ్ సిస్టమ్ చేంజ్ ప్రతినిధి లూకస్ కేహ్లే ద్వారకాతిరుమల మండలం గుండుగొలనుగుంటలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. అలాగే ఏటీఎం(ఎనీ టైమ్ మనీ), ఏ గ్రేడ్ మోడల్స్‌తో పాటు, పీఏండీఎస్ (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్), ఆర్‌డీఎస్ (రబీ డ్రై సోయింగ్) తదితర పంట పొలాలను సందర్శించి, సాగు విధానాలపై ఆరా తీశారు.

చిత్రకారుడు వెంపటాపునకు జాతీయ అవార్డులు

చిత్రకారుడు వెంపటాపునకు జాతీయ అవార్డులు
Comments
Please login to add a commentAdd a comment