
బెస్ట్ ఫిజిక్‌మెన్ టోర్నమెంట్‌లో విద్యార్థికి రజత పతక
భీమవరం: చీరాలలో నిర్వహించిన ఇంటర్ కాలేజీయట్ బెస్ట్ ఫిజిక్‌మెన్ టోర్నమెంట్‌లో భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి తోట షణ్ముఖశ్రీనివాస్ సిల్వర్ మెడల్ సాధించినట్లు కళాశాల డైరెక్టర్ ఎం జగపతిరాజు చెప్పారు. ఈనెల 17న జేఎన్టీయూకే అంతర్ కళాశాలల టోర్నమెంట్‌లో 60 కేజీల వెయిట్ విభాగంలో షణ్ముఖ శ్రీనివాస్ రజత పతకం సాధించాడన్నారు. బుధవారం విద్యార్థిని కళాశాలలో ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు, ఫిజికల్ డైరెక్టర్ పి సత్యనారాయణరాజు తదితరులు అభినందించారు.
రైలులో పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల రికవరీ
భీమవరం: రైలు ప్రయాణికులు పొగొట్టుకున్న రూ.75 వేల విలువ చేసే సెల్‌ఫోన్లను రికవరీ చేసినట్లు భీమవరం రైల్వే ఎస్సై పీవీటీ రమణ చెప్పారు. బుధవారం బాధితులకు సెల్‌ఫోన్లు అప్పగించారు. ఈ సందర్భంగా రైల్వే ఎస్సై మాట్లాడుతూ రైలులో ప్రయాణం చేసే సమయంలో ప్రయాణికులు వారి వస్తువులు, సెల్‌ఫోన్లు భద్రంగా చూసుకోవాలన్నారు.
మోటారుసైకిల్ అదుపు తప్పి..
ఏలూరు (టూటౌన్): మోటారుసైకిల్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన ఏలూరు రూరల్ మండలంలో చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భీమడోలు మండలం ఆగడాలంక గ్రామానికి చెందిన భలే బాలాజీ (34) బంటా మేస్త్రిగా పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ఇతనికి వివాహం జరిగినప్పటికీ భార్యాభర్తల మధ్య ఉన్న చిన్నపాటి విభేధాలతో ఇరువురు వేరుగా ఉంటున్నారు. అయితే బాలాజీ తన సొంత గ్రామంలో కాకుండా తన అక్క ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో మాదేపల్లి గ్రామం నుంచి మంగళవారం అర్ధరాత్రి కోటేశ్వర దుర్గాపురం వైపు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడ్డాడు. ఈ ఘటనలో తలపై బలమైన గాయం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఉదయం అతడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్తుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనంతరం బుధవారం సాయంత్రం బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు.

బెస్ట్ ఫిజిక్‌మెన్ టోర్నమెంట్‌లో విద్యార్థికి రజత పతక
Comments
Please login to add a commentAdd a comment