కస్తూర్బా విద్యాలయం తనిఖీ
చిన్నంబావి: మండల కేంద్రంలోని కేజీబీవీని బుధవారం మండల ప్రత్యేకాధికారి రఘునాథ్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం తయారీని పరిశీలించి తీసుకుంటున్న జాగ్రత్తలు, మెనూ అమలును అడిగి తెలుసుకున్నారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు, రికార్డులను పరిశీలించారు. పదోతరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున సిలబస్, ప్రత్యేక తరగతుల నిర్వహణ తదితరాలపై ఆరా తీశారు. అలాగే మండలంలోని కొప్పునూరు ఎస్సీ వసతిగృహాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రమణారావు, సిబ్బంది పాల్గొన్నారు.
ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయొద్దు
వనపర్తి టౌన్: ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేయడం నిబంధనలకు విరుద్దమని పుర శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉమామహేశ్వర్‌రెడ్డి అన్నారు. ట్రేడ్ లైసెన్స్ వసూళ్లలో భాగంగా బుధవారం ఆయన పుర సిబ్బందితో కలిసి వివిధ ప్రాంతాల్లో పర్యటించగా చాలా దుకాణాలకు లైసెన్స్ లేదని గుర్తించారు. కలెక్టరేట్ మార్గంలో ఉన్న దుకాణాదారులు కూడా టేడ్ర్ లైసెన్స్ తీసుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. కొందరు దుకాణాదారులు గడువు కావాలని కోరగా, మరికొందరు లైసెన్స్ ఫీజు అధికంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు దుకాణదారులు లైసెన్స్ తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని, అలాంటి వారికి నోటీసులిచ్చామని, గడువు ముగిసిన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణాల కొలతల ఆధారంగా ట్రేడ్ లైసెన్స్ రుసుం వసూలు ప్రక్రియ వేగవంతం చేశామని, రోజు రూ.లక్ష లక్ష్యంగా కాగా అందుకు చేరువగా వసూలు చేస్తున్నామన్నారు. పుర సిబ్బంది చేతికి డబ్బులు ఇవ్వొద్దని.. ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసి వెంటనే రసీదు పొందవచ్చని సూచించారు.
వృద్ధాశ్రమాన్ని సందర్శించిన అడిషనల్ కమాండెంట్
వనపర్తి విద్యావిభాగం: మండలంలోని చిట్యాల సమీపంలో ఉన్న చేయూత అనాథ ఆశ్రమంలోగల వృద్ధాశ్రమానికి బుధవారం 10వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ జయరాజ్, అసిస్టెంట్ కమాండెంట్ పి.శ్రీనివాసులు సందర్శించారు. వృద్ధులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులను అభినందించి నిత్యావసర సరుకులు అందజేశారు. వారి వెంట రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఆర్పీ సింగ్, ఆర్‌ఎస్‌ఐ శ్రీకాంత్, బోజ్యానాయక్, ఏఆర్‌ఎస్‌ఐ జయవర్ధన్‌చారి, భీమయ్య, అశోక్, రవీంద్రనాయక్, సుధాకర్ తదితరులు ఉన్నారు.
మన్యంకొండ
హుండీ లెక్కింపు
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం హుండీలను లెక్కించగా.. రూ. 32,39,301 ఆదాయం వచ్చింది. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ఉదయం 10 గంటలకు ప్రారంభమై.. రాత్రి 7 గంటలకు ముగిసింది. హుండీ లెక్కింపులో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి, దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, పాలకమండలి సభ్యులు వెంకటాచారి, శ్రావణ్‌కుమార్, మంజుల, సుధ, ఐడీబీఐ మేనేజర్ రాజవర్దన్‌రెడ్డి, సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
కస్తూర్బా విద్యాలయం తనిఖీ
కస్తూర్బా విద్యాలయం తనిఖీ
కస్తూర్బా విద్యాలయం తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment