Sakshi News home page

adsolute video ad after first para

Raman Subba Row Death: ఆంధ్రప్రదేశ్‌ మూలాలున్న ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కన్నుమూత

Published Fri, Apr 19 2024 9:54 AM

Former England Cricketer Raman Subba Row Passes Away Aged 92 - Sakshi

ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌, ఐసీసీ మాజీ రిఫరీ రామన్‌ సుబ్బా రో 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వయసు పైబడటం, దీర్ఘకాలిక అనారోగ్య కారణాల చేత సుబ్బా రో మృతి చెందినట్లు తెలుస్తుంది. భారత మూలాలున్న సుబ్బా​ రో ఇంగ్లండ్‌ జాతీయ జట్టు తరఫున 1958-61 మధ్యలో 13 టెస్ట్‌లు ఆడి 46.85 సగటున 984 పరుగులు చేశాడు. సుబ్బా రో ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో సర్రే, నార్తంప్టన్‌ఫైర్‌ కౌంటీల తరఫున 260 మ్యాచ్‌లు ఆడి 14182 పరుగులు చేశాడు.

ఇందులో 30 శతకాలు, 73 అర్దశతకాలు ఉన్నాయి. సుబ్బా​ రో కెరీర్‌ అత్యధిక స్కోర్‌ 300 పరుగులుగా ఉంది. పార్ట్‌ టైమ్‌ లెగ్‌ స్పిన్‌ బౌలర్‌ కూడా అయిన సుబ్బా రో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 87 వికెట్లు తీశాడు. 1981 భారత్‌, శ్రీలంక పర్యటనల్లో సుబ్బా రో ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు మేనేజర్‌గా వ్యవహరించాడు.

1985-1990 మధ్యలో సుబ్బా రో ఇంగ్లండ్‌ టెస్ట్‌ మరియు కౌంటీ క్రికెట్‌ బోర్డును చైర్మన్‌గా వ్యవహరించాడు. రామన్‌ సుబ్బా రో మృతి పట్ల ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు, ఐసీసీ సంతాపం తెలిపాయి. ఈసీబీ, ఐసీసీలకు సుబ్బా రో చేసిన సేవలు ఎనలేనివని కొనియాడాయి. 

కాగా, రామన్‌ సుబ్బా రో తండ్రి పంగులూరి వెంకట సుబ్బారావు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన వాడు. సుబా​ రో తల్లి డోరిస్ మిల్డ్రెడ్ పిన్నర్ బ్రిటన్‌ మహిళ. పంగులూరి వెంకట సుబ్బారావు ఉన్నత చదువుల కోసం లండన్‌కు వెళ్లగా అక్కడ డోరిస్ మిల్డ్రెడ్ పిన్నర్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి, పెళ్లికి దారి తీసింది. వీరిద్దరి సంతానమే రామన్‌ సుబ్బా రో.

Advertisement

adsolute_video_ad

homepage_300x250