Sakshi News home page

adsolute video ad after first para

యర్రగొండపాలెంలో గ్లాసు గుర్తు మాయం

Published Thu, May 2 2024 9:05 AM

-

యర్రగొండపాలెం: యర్రగొండపాలెం నియోజకవర్గంలో గ్లాస్‌ గుర్తు విషయంలో ఎన్నికల అధికారులు వ్యవహరించిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యే నాటికి యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి 18 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు కాకుండా ఇండిపెండెంట్లుగా నామినేషన్‌ వేసిన నలుగురు అభ్యర్థులు గ్లాస్‌ గుర్తును కోరుకున్నారు. ముగ్గురు అభ్యర్థులు విత్‌ డ్రా చేసుకున్నట్లయితే ఒక ఈవీఎంతో ఎన్నికలు జరపటానికి సులువుగా ఉంటుందని ఆర్వో శ్రీలేఖ ప్రధాన పార్టీలకు చెందిన ఎన్నికల చీఫ్‌ ఏజెంట్‌లు, అభ్యర్థులతో చర్చలు జరిపారు. ఒక ఈవీఎంలో నోటాతో కలుపుకుని 16 గుర్తులు పెట్టుకునే అవకాశం ఉందని, అంతకు మించి అభ్యర్థులు పోటీలో ఉంటే రెండో ఈవీఎం ఉపయోగించాల్సి ఉంటుందని ఆమె వివరించారు. ఒక రోజు ముందుగా (ఆదివారం) ఆర్వో తన సహాయకులతో సెల్‌ ద్వారా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి చీఫ్‌ ఏజెంట్‌తో చర్చలు జరిపారు. పరిస్థితులను బట్టి ఇండిపెండెంట్లతో విత్‌ డ్రా చేయించేందుకు ప్రయత్నిస్తానని ఆయన బదులిచ్చినట్లు తెలిసింది. ఆ తరువాత విత్‌ డ్రా చేసుకోవటానికి తమకు ఇష్టం లేకపోయినప్పటికీ చేసేదిలేక కొంతమంది ఇండిపెండెంట్‌లు సుముఖత చూపారు. తమకు అనుకూలమైన వారితో విత్‌ డ్రా చేయించాలని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి చీఫ్‌ ఏజెంట్‌పై ఆర్వో తీవ్ర ఒత్తిడి చేశారు. ప్రయార్టీ ప్రకారం గ్లాస్‌ గుర్తు ఒక ఇండిపెండెంట్‌ అభ్యర్థికి కేటాయించాల్సి ఉంది. ఈ గుర్తు తమకు దక్కదన్న ఉద్దేశంతో ముగ్గురు ఇండిపెండెంట్‌లు తమ నామినేషన్లను విత్‌ డ్రా చేసుకున్నారు. ఏజెంట్లు, అభ్యర్థులు ఒక గదిలో కూర్చొని ఉండగా నిర్దేశించిన సమయం పూర్తయ్యే వరకు టైం పాస్‌ చేసేందుకు ఆర్వో వారి వద్దకు వెళ్లి ఎన్నికలు జాగ్రత్తగా నిర్వహించుకునేలా చూసుకోవాలని, ఖర్చు తగ్గించుకోవాలని హితోపదేశం చేసి బయటకి వెళ్తూ ఆ గది తలుపులు వేశారు. అనుమానం వచ్చిన వారు ఆర్వో గది వద్దకు వెళ్లేలోపు చివరి నిమిషం (2.58 గంటలకు)లో గ్లాస్‌ గుర్తుకు అర్హత ఉన్న అభ్యర్థి ఆర్వో వద్దకు వెళ్లి తాను కూడా విత్‌ డ్రా చేసుకున్నారు. దీంతో గ్లాస్‌ గుర్తు ఈవీఎంలో మాయమైంది. గ్లాసు గుర్తు మాయం వెనుక ఎన్నికల అధికారి వ్యవహరించిన తీరుపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక ఈవీఎంకు సరిపడా అభ్యర్థులున్నా గ్లాసు గుర్తు వచ్చే అభ్యర్థి విషయంలో లోపాయికారిగా వ్యవహరించి ఏమైనా కుట్ర చేశారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఏజెంట్‌ ప్రశ్నిస్తే పోలీసు కేసు పెట్టాల్సి వస్తుందని ఆర్వో బెదిరింపులకు దిగినట్లు ఆయన ఆరోపించారు.

ఎన్నికల నిర్వహణాధికారి తీరుపై ఆరోపణలు

చివరి నిముషంలో విత్‌డ్రా చేసుకున్న ఇండిపెండెంట్‌

ఇదేంటని ప్రశ్నిస్తే కేసులు పెడతామంటూ బెదిరింపులు

Advertisement

adsolute_video_ad

homepage_300x250