Sakshi News home page

adsolute video ad after first para

‘మా విశ్వాసంపై దాడి’.. రాహుల్‌, అఖిలేష్‌పై ప్రధాని మోదీ విమర్శలు

Published Fri, Apr 19 2024 2:29 PM

PM Modi accuses Akhilesh Yadav Rahul Gandhi of attacking our faith - Sakshi

లక్నో: ప్రతిపక్ష కూటమిలోని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. మోదీ ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహా నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో శుక్రవారం పాల్గొని మాట్లాడుతూ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు.

‘ప్రతి పక్షాలు మా(బీజేపీ) విశ్వాసంపై దాడి చేసి.. బంధు ప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయలు చేస్తున్నాయి. మరోసారి ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు యువరాజులు కొత్త సినిమా తీస్తున్నారు. అయితే ఇప్పటికే వారు తీసిన సినిమాను తిరస్కరించారు. బంధు ప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయలు ముసుగులోనే ప్రతీసారి ప్రతీపక్షాలు ఉత్తరప్రదేశ్‌ ప్రజలను ఓట్ల అడుగుతారు.

..ప్రతిపక్ష నాయకులకు మా విశ్వాసంపై దాడి చేస్తున్నారు. కానీ వాటికి మాపై దాడి చేసే అవకాశమే లేదు. ఇక్కడి కాంగ్రెస్‌ అభ్యర్థి భారత్‌ మాతాకి జై అనడానికి కూడా ఇబ్బంది పడతాడు. అయోధ్య రామ మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ట​ కార్యక్రమ ఆహ్వానాన్ని ఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీలు తిరస్కరించాయి. ప్రతి రోజు ప్రతిపక్ష పార్టీలు రాముడిని, సనాతన ధర్మాన్ని దూషిస్తాయి. సమాజ్‌వాదీ పార్టీ నేతలు రాముడి భక్తులను కపటంతో కూడిన వ్యక్తులని బహిరంగా వ్యాఖ్యానిస్తారు’ అని  ప్రధాని మోదీ  మండిపడ్డారు.
 

Advertisement

adsolute_video_ad

homepage_300x250