Sakshi News home page

adsolute video ad after first para

‘టీవీ రాముడి’ ఎన్నికల ప్రచారం.. రోడ్‌షోలో జేబు దొంగల చేతివాటం..!

Published Tue, Apr 23 2024 4:58 PM

He Raised Hands To Say Jai Shri Ram At Bjp Arun Govil Rally Lost Rs 36000. - Sakshi

పాట్నా : దేశంలో పలు దశల్లో జరగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఆయా స్థానాల అభ్యర్ధులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో దొంగలు తమ చేతి వాటం చూపిస్తున్నారు. అభ్యర్ధులు, కార్యకర్తలను ఇలా దొరికనోళ్లను దొరికినట్లుగా దోచేస్తున్నారు. 

తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌ మీరట్‌ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్ధిగా ప్రముఖ టీవీ సీరియల్ ‘రామాయణ్’లో రాముడి పాత్రను పోషించిన అరుణ్ గోవిల్, తన సహనటులు సీతగా నటించిన దీపికా చిక్లియా, లక్ష్మణ్ పాత్రలో నటించిన సునీల్ లహ్రీ నగరంలో ఎన్నికల ప్రచారం రోడ్‌షో నిర్వహించారు.


 
ఈ ఎన్నికల ప్రచారంలో ఓ షాపు యజమాని కులభూషణ్ తన దుకాణం దాటి వెళ్తున్న అరుణ్‌ గోవిల్‌ కాన్వాయ్‌ కనిపిండచంతో భక్తి పార్వశంలో మునిగిపోయారు. కులభూషణ్‌తో పాటు స్థానాలు చేతులు పైకెత్తి ‘జైశ్రీరామ్‌’ నినాదాలతో హోరెత్తించారు. అప్పుడే దొంగలు తమ చేతికి పనిచెప్పారు. కులభూషణ్‌ జేబులో ఉన్న 36 వేలతో పాటు ఇతరుల నుంచి పెద్ద మొత్తంలో నగదు, బంగారం, ఫోన్‌లు ఇతర విలువైన వస్తువుల్ని కాజేశారు. దీంతో సుమారు డజను మందికి పైగా తమ విలువైన వస్తువుల్ని పోవడంపై పోలీసుల్ని ఆశ్రయించారు.  


బీజేపీ పశ్చిమ ప్రాంత సమన్వయకర్త అలోక్ సిసోడియా మొబైల్ ఫోన్ కూడా చోరీకి గురైంది. కొంతమంది అగంతకులు గుంపుగా ఉన్న అభిమానుల్ని అవకాశంగా తీసుకుని చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఇక బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఢిల్లీకి చెందిన ముగ్గురు నివాసితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆ ముగ్గురు దొంగిలించిన మొబైల్‌లు, కార్లను స్వాధీనం చేసుకున్నారు. 

కాగా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నియోజకవర్గానికి ఏప్రిల్ 26న రెండో దశలో పోలింగ్ జరగనుంది.

Advertisement

adsolute_video_ad

homepage_300x250