
జిందాల్ ప్లాంట్‌ను సందర్శించిన ఐజీ రవికృష్ణ
యడ్లపాడు: కృష్ణా జిల్లాలో ఇటీవల పట్టుబడ్డ నాలుగు టన్నుల అక్రమ గంజాయిని ధ్వంసం చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఐజీ రవికృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ ఉన్నతాధికారుల బృందం యడ్లపాడు మండలం కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని జిందాల్ అర్బన్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ను సందర్శించింది. ప్లాంట్ ఆపరేషన్ ఏపీ అధ్యక్షుడు ఎం.వి. చారితో సమావేశమయ్యారు. ప్లాంట్‌లో ఈనెల 22న గంజాయి దహనం కోసం అనుమతి తీసుకున్నారు. కార్యక్రమానికి డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అనంతరం అధికారుల బృందం ప్లాంట్‌లోని వివిధ విభాగాలను పరిశీలించింది. కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధర్, ఈగల్ విభాగం ఎస్పీ కె. నగేష్‌బాబు, గన్నవరం డీఎస్పీ సీహెచ్. శ్రీనివాసరావు, పెనమలూరు ిసీఐ వెంకటరమణ, చిలకలూరిపేట గ్రామీణ సీఐ బి. సుబ్బరాయుడు, ఎస్‌ఐ వి. బాలకృష్ణ పాల్గొన్నారు.
పట్టుబడిన నాలుగు టన్నులు
గంజాయి దహనానికి ఏర్పాట్లు
ప్లాంట్ అపరేషన్ అధ్యక్షుడు
ఎం.వి. చారితో సమీక్ష
ఉన్నతాధికారులతో కలిసి
ప్లాంట్ విభాగాల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment