Sakshi News home page

adsolute video ad after first para

Uttar Pradesh: 80లో 8.. రేపే తొలి సమరం!

Published Thu, Apr 18 2024 12:42 PM

Uttar Pradesh Lok Sabha Elections 2024 Voting for 8 seats in Phase 1 - Sakshi

లక్నో: దేశవ్యాప్తంగా తొలిదశ సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19న జరగనున్నాయి. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా ఢిల్లీని కైవసం చేసుకునేందుకు కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 80 స్థానాలకు మొత్తం ఏడు దశల్లో పోలింగ్‌ జరగనుంది. ఏప్రిల్ 19న మొదటి దశలో ఎనిమిది స్థానాల్లో ఓటర్లు తమ  ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

తొలి దశ నియోజకవర్గాలు ఇవే..
ఉత్తర ప్రదేశ్‌లో తొలి దశలో ఎన్నికలు 8 నియోజకవర్గాల్లో జరగనున్నాయి. అవి పిలిభిత్, సహరాన్‌పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్. వీటిలో ఐదు సహారన్‌పూర్, కైరానా, బిజ్నోర్, మొరాదాబాద్, రాంపూర్ జనరల్ నియోజకవర్గాలు కాగా మిగిలినవి రిజర్వ్‌డ్‌ స్థానాలు.

గత సార్వత్రిక ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ (BJP) ఈ ఎనిమిది సీట్లలో కేవలం మూడింటిని మాత్రమే గెలిచింది. అవి పిలిభిత్, కైరానా, ముజఫర్‌నగర్. సమాజ్‌వాదీ పార్టీ మొరాదాబాద్, రాంపూర్ స్థానాలను గెలుచుకోగా, బహుజన్ సమాజ్ పార్టీ సహరాన్‌పూర్, బిజ్నోర్, నగీనా స్థానాలను కైవసం చేసుకుంది. 

ప్రధాన అభ్యర్థులు వీళ్లే..

  • పిలిభిత్ నియోజవర్గం - జితిన్ ప్రసాద్‌ (బీజేపీ), భగవంత్ శరణ్ గంగ్వార్ (ఎస్‌పీ), అనిస్ అహ్మద్ ఖాన్ (బీఎస్‌పీ)
  • సహరాన్‌పూర్ నియోజవర్గం- రాఘవ్ లఖన్‌పాల్ (బీజేపీ), మాజిద్ అలీ (బీఎస్పీ), ఇమ్రాన్ మసూద్ (కాంగ్రెస్)
  • కైరానా నియోజవర్గం - ప్రదీప్ కుమార్ (బీజేపీ),  శ్రీపాల్ సింగ్ (బీఎస్‌పీ), ఇక్రా హసన్ (ఎస్‌పీ)
  • ముజఫర్‌నగర్ నియోజవర్గం- సంజీవ్ బల్యాన్ (బీజేపీ), హరీంద్ర మాలిక్ (ఎస్‌పీ), ధారా సింగ్ ప్రజాపతి (బీఎస్పీ)
  • రాంపూర్ నియోజవర్గం- ఘనశ్యామ్ లోధి (బీజేపీ), జీషన్ ఖాన్ (బీఎస్పీ) 
  • మొరాదాబాద్ నియోజవర్గం- సర్వేష్ సింగ్ (బీజేపీ), మొహమ్మద్ ఇర్ఫాన్ సైఫీ (బీఎస్పీ)
  • బిజ్నోర్ నియోజవర్గం    - చందన్ చౌహాన్ (ఆర్‌ఎల్‌డీ), విజేంద్ర సింగ్ (బీఎస్పీ), యశ్వీర్ సింగ్ (ఎస్‌పీ)
  • నగీనా నియోజవర్గం- ఓం కుమార్ (బీజేపీ), సురేంద్ర పాల్ సింగ్ (బీఎస్పీ), మనోజ్ కుమార్ (ఎస్‌పీ)

Advertisement

adsolute_video_ad

homepage_300x250