Sakshi News home page

adsolute video ad after first para

Janata Party: కేంద్రంలో తొలిసారి కాంగ్రెసేతర సర్కారు

Published Thu, Apr 18 2024 5:01 AM

Lok sabha elections 2024: Janata Party wave takes over in 1977 - Sakshi

ఇందిర హటావో     దేశ్‌ బచావో

ఫలించిన విపక్షాల సమైక్యనాదం

ఆరో లోక్‌సభ పోరులో ఇందిర ఓటమి

కేంద్రంలో కొలువుదీరిన జనతా సర్కారు

ప్రజల హక్కులను కాలరాస్తే, ప్రజాస్వామ్యా నికి పాతరేస్తే ఏమవుతుందో ఆరో లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాం«దీకి అనుభవంలోకి వచి్చంది. ఇందిరకు, కేంద్రంలో కాంగ్రెస్‌కు తొలి ఓటమి రుచి చూపడమే గాక తొలి కాంగ్రెసేతర సర్కారుకు బాటలు పరిచిన ఎన్నికలుగా అవి చరిత్రలో నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ ముసుగులో ప్రతిపక్షాల నేతలందరినీ జైల్లోకి నెట్టిన ఇందిర వారి చేతుల్లోనే మట్టికరిచారు. జనతా పతాకం కింద ప్రధాన విపక్షాలన్నీ ఒక్కటై ‘ఇందిర హటావో, దేశ్‌ బచావో’ నినాదంతో కాంగ్రెస్‌ను ఓడించాయి...   

1975 జూన్‌ 25 నుంచి 1977 మార్చి 21 దాకా 21 నెలల కొనసాగిన ఎమర్జెన్సీ దేశ ప్రజలకు పీడకలగా మారింది. పౌర హక్కులను హరించడం మొదలుకుని తీవ్ర నిర్బంధం అమలైంది. పత్రికా స్వేచ్ఛను కాలరాశారు. మగవాళ్లకు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వంటి చేష్టలతో ఇందిర సర్కారు బాగా చెడ్డపేరు తెచ్చుకుంది. మొరార్జీ దేశాయ్‌ మొదలుకుని జయప్రకాశ్‌ నారాయణ్‌ దాకా విపక్ష నేతలంతా జైలుపాలయ్యారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విపక్షాల కార్యకర్తలు ఊచలు లెక్కించారు.

ఎమర్జెన్సీ అనంతరం ఏడాది ఆలస్యంగా 1977లో ఇందిర ఎన్నికలకు వెళ్లారు. ఆమెను ఢీ కొట్టేందుకు కమ్యూనిస్టేతర ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. భారతీయ జనసంఘ్, భారతీయ లోక్‌దళ్, సంయుక్త సోషలిస్ట్‌ పార్టీ, కాంగ్రెస్‌ ఫర్‌ డెమక్రసీతో పాటు కాంగ్రెస్‌ (వో) కూడా జేపీ స్థాపించిన జనతా పారీ్టలో కలసిపోయాయి. మొరార్జీ దేశాయ్‌ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.

జేపీ ‘ఇందిరా హటావో, దేశ్‌ బచావో’ నినాదం దుమ్మురేపింది. ఎమర్జెన్సీపై జనాగ్రహం ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించింది. జనతా పార్టీ 41.32 శాతం ఓట్లతో 295 స్థానాలు సాధించింది. మిత్రపక్షాలతో కలిపి జనతా బలం 330కి చేరింది. 492 స్థానాల్లో పోటీ చేసిన ఇందిర కాంగ్రెస్‌ (ఆర్‌) కేవలం 154 స్థానాలతో కుదేలైంది. అంతటి ప్రజా వ్యతిరేకతలోనూ దక్షిణాది 92 స్థానాలతో ఇందిరకు అండగా నిలిచింది. వాటిలో 41 ఆంధ్రప్రదేశ్‌ చలవే. హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలిచింది రెండే సీట్లు! రాయ్‌బరేలీలో ఇందిర ఓటమి చవిచూశారు! ఎమర్జెన్సీ వేళ రాజ్యాంగేతర శక్తిగా మారిన చిన్న కొడుకు సంజయ్‌గాంధీ కూడా అమేథీలో పరాజయం పాలయ్యారు.

తొలి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీ
తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మొరార్జీ దేశాయ్‌ 1977 మార్చి 24న ప్రమాణం చేశారు. అయితే మూడేళ్లకే సర్కారులో లుకలుకలు మొదలయ్యాయి. నేతలు జనతా పార్టీని వీడడంతో లోక్‌సభలో బలం తగ్గింది. దాంతో మొరార్జీ గద్దె దిగాల్సి వచి్చంది.

రాజ్‌ నారాయణ్‌... జనతాలో ముసలం
ఈ సందర్భంగా రాజ్‌ నారాయణ్‌ గురించి తప్పక చెప్పుకోవాలి. 1977 ఎన్నికల్లో రాయ్‌బరేలిలో ఇందిరను ఓడించిన ఈయన తదనంతరం జనతాపారీ్టలో ముసలానికీ కారకుడయ్యారు. జనతాను వీడి జేడీ(ఎస్‌)ను స్థాపించారు. మొరార్జీ రాజీనామాతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాలంటూ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిని అభ్యరి్థంచారు. కానీ ఇందిరా కాంగ్రెస్‌ సహకారంతో జనతా పార్టీ నేత చౌధరీ చరణ్‌సింగ్‌ 1979 జూలై 28న ప్రధాని అయ్యారు. అయితే ఇందిర బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు విసిగి నెలలోపే రాజీనామా చేశారు!

విశేషాలు... పెరిగిన ఓటింగ్‌
► 1977 లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం 60.49 శాతానికి పెరిగింది.  
► 1971 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ స్థానాలను 542కు పెంచారు.
► 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి.  
► ఐదు జాతీయ పార్టీలు, 15 రాష్ట్ర పారీ్టలు, 14 రిజిస్టర్డ్‌ పారీ్టలు లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొన్నాయి.
► ఎమర్జెన్సీ విధింపు పట్ల ఇందిర ఏనాడు పశ్చాత్తాపడలేదు. మరో దారి లేకపోయిందంటూ సమర్థించుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం 1976లోనే ఎన్నికలు జరిపి ఉంటే తానే గెలిచేదాన్నని కూడా ఇందిర అభిప్రాయపడటం విశేషం!

ఆరో లోక్‌సభలో పారీ్టల బలాబలాలు
(మొత్తం స్థానాలు 542)
పారీ్ట                స్థానాలు
జనతా పారీ్ట          295
కాంగ్రెస్‌                  154
సీపీఎం                     22
అన్నాడీఎంకే              18
ఇతరులు                   43
స్వతంత్రులు               10  

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

adsolute_video_ad

homepage_300x250