Sakshi News home page

adsolute video ad after first para

నిజామాబాద్‌ జిల్లాలో 93.72 శాతం ఉత్తీర్ణత

Published Thu, May 2 2024 5:35 PM

-

నిజామాబాద్‌ అర్బన్‌: ఎస్సెస్సీ ఫలితాల్లో నిజామాబాద్‌ జిల్లాలో 93.72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లావ్యాప్తంగా 21,858 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 20,486 మంది పాసయ్యారు. ఇందులో బాలురు 11,144 మందికి 10,330 మంది(92.70శాతం) ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 10,714 మందికి 10,156 మంది (94.79 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గతేడాది 21వ స్థానంలో ఉన్న జిల్లా ఈసారి 14వ స్థానానికి ఎగబాకింది. జిల్లా వ్యాప్తంగా 243 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. 284 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. గతేడాది 163 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత నమోదుకాగా, 153 మంది 10 జీపీఏ సాధించారు.

Advertisement

adsolute_video_ad

homepage_300x250