Sakshi News home page

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు..

Published Tue, Feb 27 2024 12:48 AM

మంత్రి తుమ్మల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కౌన్సిలర్లు, నాయకులు - Sakshi

బాన్సువాడ: బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు కండువా మార్చేశారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని మాజీ ఎమ్మల్యే రవీందర్‌రెడ్డి నివాసంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్‌ చేరారు. డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు పాత బాలకృష్ణతో పాటు కౌన్సిలర్లు రమాదేవి, రుక్మిణి గైక్వాడ్‌, బాడి శ్రీనివాస్‌, అహ్మద్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనుయుల వ్యవహార శైలి నచ్చక ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్‌లో చేరిన నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వ్యాపారవేత్త మోరిల్‌ శ్రీనివాస్‌, నాయకులు మైలారం భాస్కర్‌రెడ్డి, అంజద్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

homepage_300x250