Sakshi News home page

adsolute video ad after first para

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

Published Thu, May 2 2024 4:20 PM

గెలుప

గద్వాల అర్బన్‌: కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లురవి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జమ్మిచేడులోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయనతోపాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లురవి మాట్లాడుతూ.. గత పదేళ్లుగా బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు ప్రజా సంక్షేమాన్ని మరిచాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన అయిదు గ్యారంటీలను ప్రజల్లోకి విస్త్రతంగా ప్రచారం చేయాల్సిన ఆవసరం ఉందన్నారు. కొంతమంది కాంగ్రెస్‌పై బురదజల్లె ప్రయత్నం చేస్తున్నారని, ఎవరూ కూడా అపోహలకు గురి కావాల్సిన ఆవసరం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీతోనే ఆభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని చెప్పారు. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఆనంతరం పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ రావడంతో కొన్ని పథకాలు అమలు కాలేదని, ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తోందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో తనను ఆశీర్వాదించాలని కోరారు.

ఇరువర్గాల వాగ్వాదం

ఇదిలాఉండగా, కాంగ్రెస్‌ ముఖ్య నాయకుల సమావేశంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత వర్గానికి, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డికి మరోసారి వివాదం చోటు చేసుకోవడం హట్‌టాపిక్‌గా మారింది. ఎన్నికల సందర్భంగా ముద్రించిన పాంప్లెట్స్‌(స్టిక్కర్స్‌)లో తన ఫొటో ఉండడంతో వాటిని అతికించడం లేదని బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి సమావేశంలో లేవనెత్తారు. అయితే ఇక్కడ జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత ఇంచార్జ్‌, దాంతో మీ ఫొటో ఉన్న పాంప్లెట్‌ అతికించాల్సిన అవసరం లేదని జెడ్పీ చైర్‌పర్సన్‌ వర్గీయుడైన అమరవాయి కృష్ణారెడ్డి చెప్పారు. దీంతో వారిరువురి మధ్య వాగ్వాదం చేసుకొంది. ఓ క్రమంలో నువ్వెవరు నాకు చెప్పడానికి.. అంటూ బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి అమరవాయి కృష్ణారెడ్డిపై మండిపడ్డారు. ఈ వాగ్వాదం మల్లురవి ఎదుటే చోటు గమనార్హం. అదేవిధంగా బండ్ల చంద్రశేఖర్‌రెడ్డిని వేదికపైకి పిలవగా వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో మల్లు రవి ఇరువర్గాలను సముదాయించారు. మొత్తంగా పార్లమెంట్‌ ఎన్నికల వేళ గద్వాల కాంగ్రెస్‌ నాయకులు వర్గాలుగా విడిపోయి వాగ్వాదాలు.. దాడులు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

● జిల్లా కేంద్రంలోని దౌదర్‌పల్లిలో, మోమిన్‌మహెల్లాలో మల్లురవి, సరిత, నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. గత పదేళ్లుగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రజా సమస్యలు, అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు.

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం

నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మల్లు రవి

జెడ్పీచైర్‌పర్సన్‌ వర్గం, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి మధ్య మరోసారి వాగ్వాదం

ప్రచార స్టిక్కర్లపై నెలకొన్న వివాదం

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
1/1

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

Advertisement

adsolute_video_ad

homepage_300x250