
బీర్‌పూర్ నృసింహునికి రూ.26.33లక్షల ఆదాయం
సారంగాపూర్: బీర్‌పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామికి బ్రహ్మోత్సవాల ద్వారా రూ.26,33,525 ఆదాయం సమకూరింది. బ్రహ్మోత్సవాలు ముగియడంతో అధికారులు హుండీ ఆదాయంతోపాటు, ఇతర మార్గాల ద్వారా ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. హుండీల ద్వారా రూ.13,69,163, వేలంపాటల ద్వారా రూ.7.10 లక్షలు, టికెట్ల ద్వారా రూ. 5,54,362 వచ్చాయి. గతేడాది రూ.26.06 లక్షలు ఆదాయం సమకూరగా.. ఈ ఏడాది రూ.26,806 పెరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మిశ్రమ బంగారం 6 గ్రాములు, మిశ్రమ వెండి 1.280 కిలోలు, విదేశీ నోట్లు 20 వచ్చాయి. లెక్కింపులో ఆలయ ప్రధాన అర్చకులు వొద్ధిపర్తి పెద్ద సంతోష్, ఉమ్మడి జిల్లా కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ముప్పాల రాంచందర్‌రావు, మాజీ ఎంపీపీలు మసర్తి రమేశ్, గుడిసె శ్రీమతి, ఆలయ మాజీ చైర్మన్లు ఎనగంటి సామ్రాట్, నేరెళ్ల సుమన్‌గౌడ్, మాజీ సర్పంచ్ గర్షకుర్తి శిల్ప, ఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment