
‘టీచర్స్’ టఫ్‌ఫైట్!
కరీంనగర్: కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు వారం రోజులే గడువు ఉండడంతో ప్రచారం ఊపందుకుంది. ఈసారి ఎన్నికలు ఉపాధ్యాయుల్లో జోష్ పెంచుతున్నాయి. కులాలు, సామాజికవర్గాల వారీగా ఉపాధ్యాయులు విడిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బీసీ నినాదం ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలోని బీసీ కులగణనపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సామాజికవర్గాల వారీగా ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహిస్తూ తమవర్గం వారి గెలుపునకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో 15మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నిక కొత్త 15జిల్లాల పరిధిలో జరగనుండగా.. మొ త్తం 27,088మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నా రు. బీజేపీ తరఫున మల్క కొమురయ్య, పీఆర్‌టీ యూ నుంచి వంగ మహేందర్‌రెడ్డి, టీపీటీఎఫ్, యూటీఎఫ్, యూఎస్పీసీ సంఘా ల మద్దతుతో సంగారెడ్డికి చెందిన అశోక్‌కుమార్, ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి ఎస్టీయూ, మోడల్ స్కూల్, కేజీబీవీ, సీపీఎస్ సంఘాల మద్దతుతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మిగిలినవారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో దిగి, చాప కింద నీరులా ప్రచారం సాగిస్తున్నారు.
15 జిల్లాల పరిధిలో 27,088 మంది ఓటర్లు
నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని ప్రస్తుతం 15 కొత్త జిల్లాల్లో 27,088 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. ఇందులో 16,932 మంది పురుషులు, 10,156మంది మహిళా ఓటర్లున్నారు. అత్యధికంగా కరీంనగర్‌లో 4,305 మంది, నిజామాబాద్‌లో 3,751మంది, సిద్దిపేటలో 3,212 మంది ఉన్నారు. అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 83 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. హన్మకొండ జిల్లాలో 166ఓట్లు, ఆసిఫాబాద్‌లో 470 ఓట్లు, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 950 ఓట్లు ఉన్నాయి.
విజేతలెవరో?
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి వ్యాపారులు, రియల్డర్లు ఉపాధ్యాయ సంఘాల్లో రాష్ట్రస్థాయి పదవులు అనుభవించిన వారు తలపడుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డికి పీఆర్టీయూ టికెట్ నిరాకరించడంతో ఎస్టీయూ, మిగతా సంఘాలను కలుపుకుని బరిలో నిలిచారు. హైదరాబాద్‌లో విద్యాసంస్థలను నెలకొల్పి రియల్డర్‌గా పేరు సంపాదించుకున్న మల్క కొమురయ్య బీజేపీ మద్దతుతో బరిలో నిలిచారు. అత్యధిక మెంబర్‌షిప్ కలిగిన పీఆర్‌టీయూ నుంచి వంగ మహేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. పోటీలో ఉండే అభ్యర్థులు ఎవరెవరో తేలిపోవడంతో ఉపాధ్యాయులు విరివిరిగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అభ్యర్థుల విజయం కోసం విందులు, ఆత్మీయ సమ్మేళనాలతో మునిగి తేలుతున్నారు. వంగ మహేందర్‌రెడ్డి, మల్క కొమురయ్య, రఘోత్తమరెడ్డి మధ్య పోటీ ఉండే అవకాశాలు ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు వెల్లడిస్తున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి మరో వారంరోజులే గడువు
కుల, సామాజికవర్గాలుగా విడిపోతున్న ఉపాధ్యాయులు
విందులు, ఆత్మీయ సమ్మేళనాలతో ఊపందుకున్న పోరు
ఖరీదైన ఎన్నిక...
ఈసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఖరీదుగా మారింది. గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య పెరగడంతో ఖర్చు తడిసి మోపెడవుతోంది. పీఆర్‌టీయూ సంఘంతో పాటు బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థులు బలమైన సామాజికవర్గంతో పాటు వ్యాపారవేత్తలు కావడంతో భారీగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మిగితా వారు కూడా ఇప్పటినుంచే విందులు, వినోదాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ఎన్నికల్లో సామాజిక వర్గాలుగా ఉపాధ్యాయులు విడిపోయి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికలు నాయకుల మధ్యవిగా పరిగణించగా ఈసారి కుల సమీకరణాలవారీగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం పనిచేసే వారిని గెలిపించేందుకు ఉపాధ్యాయులు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

‘టీచర్స్’ టఫ్‌ఫైట్!

‘టీచర్స్’ టఫ్‌ఫైట్!

‘టీచర్స్’ టఫ్‌ఫైట్!
Comments
Please login to add a commentAdd a comment