
ఆంజనేయ స్వామి ఆలయంలో కల్యాణ వేడుకలు
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని పురాణిపేట ఆంజనేయస్వామి ఆలయంలో ఆలయ వార్షికోత్స వం సందర్భంగా శివపార్వతుల కల్యాణంను వేద పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై తమ మొక్కులు చెల్లించుకున్నారు.
రాజరాజేశ్వరస్వామి జాతర ఉత్సవాలు
మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌లో పుట్ట రాజరాజేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టు పక్కన ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు కోడెలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment