
ప్రకృతి సేద్య ఉద్యోగుల సంఘ కార్యవర్గం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రథమ మహాసభ బుధవారం స్దానిక కొత్తపేట సీపీఐ జిల్లా కార్యాలయంలో జరిగింది. ముందుగా ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వేలుగూరి రాధాకృష్ణమూర్తి ఏఐటీయూసీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కొత్త కమిటీ ఎన్నిక జరిగింది. రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా వెలుగురి రాధాకృష్ణమూర్తి, నూతన అధ్యక్షులుగా శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా ఎం.రమేష్ బాబు, ట్రెజరర్‌గా నాగేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా వరప్రసాద్ (గుంటూరు) సునీల్ కుమార్ (కడప) రాహేల్ రావు (బాపట్ల) విజయలక్ష్మి (ఎన్టీఆర్) సుధారాణి (బాపట్ల), సహాయ కార్యదర్శులుగా శ్రీనివాసరావు (విజయనగరం) వీరరాఘవయ్య (తిరుపతి) శ్రీహరి (ప్రకాశం) రమాదేవి (నంద్యాల)తో పాటు 21 మంది కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment