
యార్డుకు 1,47,414 బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 1,47,414 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,42,943 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,000 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,900 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,000 నుంచి రూ.7,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 75,790 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.
యార్డుకు
119 పసుపు బస్తాలు
దుగ్గిరాల: దుగ్గిరాల పసుపు యార్డులో బుధ వారం 119 బస్తాలు వచ్చాయి. పసుపు మొత్తం అమ్మకం చేసినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి శ్రీనివాసరరావు ఒక ప్రకటనలో తెలిపారు. సరకు 76 బస్తాలు కనిష్ఠ ధర రూ 9200 గరిష్టి ధర రూ 11000 మోడల్ ధర రూ 11000 కాయలు 43 బస్తాలు కనిష్ఠి ధర రూ 9200, గరిష్ఠ ధర రూ 11000, మోడల్ ధర రూ 11000, మొత్తం 89.250 క్వింటాళ్లు అమ్మకాలు జరిగినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment