Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Summer Best Food For Kids: సమ్మర్‌లో పిల్లలకు ఇలా చేసి పెడితే, ఇష్టంగా తింటారు, బలం కూడా!

Published Tue, Apr 23 2024 11:55 AM

Summer Delicious High Protein Food for kids check details inside - Sakshi

వేసవి అంటే పిల్లలకు ఆటవిడుపు కాలం. పరీక్షలు పూర్తయ్యిన తరువాత ఆనందంగా ఆడుకునే కాలం. ఎండా, కొండా లెక్క చేయకుండా హాయిగా తోటి స్నేహితులతో కలిసి చెంగు చెంగున గెంతులేస్తూ ఉత్సాహంగా గడిపే కాలం. మరి ఇలాంటి సమయంలో వారికి మంచి పోషకాహారాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా  ప్యాకేజ్డ్‌ ఫుడ్‌,  జంక్‌ఫుడ్‌కు  దూరంగా ఉంటూ.. ఇంట్లోనే రుచికరంగా తయారు చేసి పెట్టాలి. తాజా ఆకుకూరల్ని, కూరగాయల్ని, పండ్లను డైట్‌లో ఉంచాలి. మంచి పోషకాహారమే వారికి అసలైన దివ్యౌషధం.

 మొలకలొచ్చిన గింజ ధాన్యాలు
శనగలు, పెసలతోపాటు  మొలకలు వచ్చిన  గింజలతో క్యారట్‌ లాంటి కూరగాయ ముక్కల్ని కలిపి సలాడ్‌లా పెడితే కాల్షియం, ఇతర ప్రొటీన్లు లభిస్తాయి. దీంతో వారి ఎముక‌లు, కండ‌రాలు దృఢంగా పెరుగుతాయి. ఎదుగుద‌ల అద్భుతంగా ఉంటుంది. 

ఉడికించిన శనగలు
ఉడికించిన శ‌న‌గ‌లు రెగ్యుల‌ర్‌గా తీసుకుంటే ర‌క్త హీన‌తకు చెక్‌  చెప్పవచ్చు. ఇందులోని ఐర‌న్ కంటెంట్ శ‌రీరానికి అంది ర‌క్త వృద్ధి జ‌రుగుతుంది.రోగ నిరోధ‌క శ‌క్తి రెట్టింపు అవుతుంది. మెదడు  చురుగ్గా, వేగంగా ప‌ని చేస్తుంది.అల‌స‌ట‌, నీర‌సం వంటి స‌మ‌స్య‌లుండవు. 

పిస్తా, బాదం, జీడిపప్పుతో పాటు పల్లీలు, కుసుమలు. లాంటి గింజలను ఆహారంలో చేరిస్తే  చిన్నారుల ఇమ్యూనిటీ పెరుగుతుంది.  బల వర్ధకంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినిపించటం వల్ల పిల్లల మెదడు చురుకుగా పని చేస్తుంది. ప్రతిరోజూ కాల్షియం కోసం పాలు, పౌష్టికాహారం కోసం కోడిగుడ్లు లాంటివి సరైన సమయంలో వారికందేలా చేస్తే  తొందరగా వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.

బలవర్ధకమైన సలాడ్‌
ఉడికించిన శనగలు, ఉడికించిన బొబ్బర్లు, ఉడికించిన పెసలు, ఉల్లిపాయ, టమాటా ముక్కలు, యోగర్ట్‌, కొద్దిగా కొత్తిమీర,

తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకోవాలి. ముందుగానేఉడికించి పెట్టుకున్నగింజలు, ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసి బాగాకలపాలి. దీనికి తాజా యోగర్ట్‌, కొద్దిగా ఉప్పు, మిరియాలు వేసి  కలపాలి. దీనిపైన సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తమీద చల్లి, చల్లచల్లగా అందిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.   పిల్లల ఇష్టాఇష్టాలను బట్టి, ఇందులో కొబ్బరి,  వేయించిన పల్లీలు, స్వీట్‌కార్న్‌ కూడా యాడ్‌ చేసుకోవచ్చు. ఇది బలవర్ధక ఆహారం కూడా. 

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250