Sakshi News home page

adsolute video ad after first para

Blood Pressure: డైట్‌లో ఇది చేర్చుకుంటే..మందులతో పనిలేకుండానే బీపీ మాయం!

Published Fri, Apr 12 2024 4:59 PM

Increasing Dietary Fiber Intake Can Reduce High Blood Pressure - Sakshi

డైట్‌ల ఫైబర్‌ కంటెంట్‌ ఉన్న ఆహారపదార్థాలను చేర్చుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఫైబర్‌ కంటెంట్‌ ఉన్న పదార్థాలు తీసుకుంటే..శరీరానికి ఉపయోగపడే గట్‌ బ్యాక్టీరియా అందిస్తుంది. అలాగే గుండె జబ్బులు, స్ట్రోక్‌ వంటి ప్రమాదాలను తగ్గిస్తుందని పరిశోధన పేర్కొంది. అంతేగాదు ఈ ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు ఎలా రక్తపోటుని తగ్గిస్తాయో సవివరంగా పేర్కోంది. 

ఏం చెబుతోందంటే..
మోనాష్‌ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో మహిళలు, పురుషులు బీపీని తగ్గించడానికి తినాల్సిన డైటరీ ఫైబర్‌(ఎక్కువ ఫైబర్‌ ఉన్నవి) కొద్ది మొత్తంలో అందించారు. ఇలా ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువ ఉన్న పదార్థాలు తిన్న వారిలో రక్తపోటు తగ్గడమే గాక హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం కూడా తక్కువగా ఉన్నట్లు తేలింది. మందులతో సంబంధంల లేకుండా బీపీ గణనీయంగా తగ్గడం గుర్తించామనని అన్నారు పరిశోధకులు. అంతేగాదు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ బీపీ ఎక్కువ ఉన్న మహిళలు ఉదాహరణకు 140/90 mmHg లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారికి రోజుకి సుమారు 28% పైబర్‌ తీసుకోవాలని సూచించింది. అదే పురుషులకైతే రోజుకి 38 గ్రాముల వరకు తీసుకోవాలని స్పష్టం చేసింది.

దీని వల్ల ప్రతి అదనపు  5 గ్రా సిస్టోలిక్ బీపీ 2.8 mmHgకి, డయాస్టోలిక్‌ బీపీ 2.1 mmHgకి తగ్గుతుందని అంచనా వేసింది. ఈ పైబర్‌ కంటెంట్‌ ముఖ్యంగా శరీరానికి అత్యంత అవసరమైన గట్‌ మైక్రోబయోమ్‌ని అందించి తద్వారా బీపీకి దోహదపడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఇమ్యూన్‌ రెగ్యులేటరీ యాసిడీలను ఉత్పత్తి చేసేలా అనుమతిస్తుందని తెలిపారు. ఈ అధ్యయనం హైపర్‌ టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ కోసం డైటరీ ఫైబర్‌కి ప్రాధాన్యత ఇవ్వడం గురించి హైలెట్‌ చేసిందని పరిశోధకుడు మార్క్స్‌ చెప్పారు. తాము రోగులకు ట్రీట్‌మెంట్‌లో భాగంగా అధిక ఫైబర్‌ ఉన్న పదార్థాలను ఇచ్చాక రక్తపోటు తగ్గి హృదయ నాళాలను మెరుగ్గా ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.

ముఖ్యంగా పాశ్చాత్యుల ఆహారంలో పుష్కలంగా పీచు పదార్థాలు ఉండవని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో (యూసీఎస్‌ఎఫ్‌) పేర్కొంది. అలాగే పెద్దలు సగటు ఆహారంలో కనీసం 15 గ్రాముల చొప్పున ఫైబర్‌ తీసుకోవాలని పేర్కొంది. ఇక్కడ ఆహారంలో ఫైబర్‌ ఎక్కువగా ఉండేందుకు ఈ సింపుల్‌ చిట్కాలు ఫాలోకండి

  • సాధారణ నియమంగా, ప్రతి భోజనంలో కనీసం ఒక తృణధాన్యాలు (ఉదా., బియ్యం, మొక్కజొన్న, ఓట్స్, క్వినోవా, బుల్గుర్) చేర్చండి
  • హోల్‌గ్రెయిన్ బ్రెడ్‌ను ఎంచుకోండి (ఒక స్లైస్‌లో అత్యధిక మొత్తంలో పీచు ఉంటుంది)
  • తెల్ల బియ్యంతో కాకుండా బ్రౌన్ రైస్‌తో ఉడికించాలి
  • సలాడ్‌లకు బీన్స్ జోడించండి - దీనిలో ప్రతి ½ కప్పు సర్వింగ్‌లో 7 నుంచి 8 గ్రా ఫైబర్ ఉంటుంది
  • వారానికి రెండు లేదా మూడు సార్లు, సూప్‌లు, కూరలు వంటి వాటిలో మాంసానికి బదులుగా చిక్కుళ్ళు (ఉదా., పప్పులు, బఠానీలు, బీన్స్, చిక్‌పీస్, వేరుశెనగలు) వేయండి.
  • రోజుకు కనీసం ఐదు  పండ్లు లేదా కూరగాయలను తినే యత్నం చేయండి
  • తృణధాన్యాలకు పండ్లను జోడించడం మరింత మంచిది. 
  • పండ్ల రసాల కంటే పండు పలంగా తినడానికే ప్రయత్నించండి. ఇలా చేస్తే శరీరానికి అవసరమయ్య ఫైబర్‌ అంది రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది లేదా మందుల అవసరం లేకుండానే రక్తపోటు తగ్గిపోవడం జరుగుతుంది. 

(చదవండి: పప్పు మంచిదని తినేస్తున్నారా..?ఐతే వీళ్లు మాత్రం..)

Advertisement

adsolute_video_ad

homepage_300x250