
వర్సిటీల స్వయం ప్రతిపత్తిని పరిరక్షించాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని పరిరక్షించాలని, యూనివర్సిటీల్లో రాజకీయ జోక్యం నిషేధించాలని, ప్రైవేట్ విశ్వ విద్యాలయాల రాకను వ్యతిరేకించాలని, ఢిల్లీ యూనివర్శిటీలో సస్పెన్షన్‌కు గురైన 17 మంది విద్యార్ధులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఏఐఎస్‌ఏ జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి డిమాండ్ చేశారు. ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) జాతీయ కమిటీ పిలుపులో భాగంగా బుధవారం పట్టణంలోని నన్నయ యూనివర్శిటీ సబ్ సెంటర్ వద్ద విద్యార్ధులతో కలిసి ఏఐఎస్‌ఏ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అప్పలస్వామి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో స్వయం ప్రతిపత్తిని పరిరక్షించాలని, విశ్వ విద్యాలయాలలో వీసీ నియామకాలలో రాష్ట్ర హక్కులను కాలరాసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. రాజ్యాంగ విలువలను ప్రభుత్వాలు హరిస్తున్నాయన్నారు. ఉన్నత విద్యను పూర్తిస్థాయిలో ప్రైవేటీకరణ చేసేందుకు చట్టాలను సవరిస్తున్నారని ధ్వజమెత్తారు. విశ్వ విద్యాలయాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బి.సౌజన్య, డి. దేవి, ఎం.మానస, జ్ఞానేంద్ర, ఎ.ప్రదీప్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment