జీవితంపై విరక్తితో నిరుద్యోగి ఆత్మహత్య
ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
ఉంగుటూరు: జీవితంపై మీద విరక్తితో ఓ నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంసాలిపాలెంలో ఈనెల 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం యర్రమిల్లిపాడుకు చెందిన దాసరి సత్యనారాయణ, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కల్లుగీత వృత్తి చేసుకునే ఈ కుటుంబం కంసాలిగుంటలో నివసిస్తోంది. సత్యనారాయణ ఇద్దరు కుమార్తెలకు వివాహాలు కాగా కుమారుడు పృధ్వీ చందు హైదరాబాద్‌లో ఎంబీఏ చదువుతున్నాడు. తక్కెళ్లపాదులోని బంధువుల ఇంట్లో ఫంక్షన్ నిమిత్తం పృధ్వీ చందు హైదరాబాద్ నుంచి ఈనెల 11న వచ్చాడు. ఫంక్షన్ అనంతరం ఈనెల 17న ఒక కుమార్తెను గోపాలపురంలో అత్తారింటి వద్ద దింపేందుకు తల్లిదండ్రులు సత్యనారాయణ, పద్మ వెళ్లారు. అదేరోజు మధ్యాహ్నం ఏమైందో గానీ పృధ్వీ చందు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పక్కగదిలో ఉన్న మరో సోదరి ఎంతసేపు తలుపుకొట్టినా చందు తీయకపోవడంతో చుట్టుపక్కలవారి సాయంతో తలుపులు తీసీ చందుని భీమడోలులోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పృధ్వీ చందు మృతి చెందాడు. హైదరాబాదులో ఇంటర్న్‌షిప్ చేసే ఉద్యోగాన్ని వదిలేసి, మరొక కంపెనీకి ప్రయత్నం చేస్తుండగా రాకపోవడంతో విరక్తి చెంది పృధ్వీ చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పృధ్వీ చందు మృతితో ఆ కుటుంబం శోకసంద్రమైంది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అందజేయగా మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment