Sakshi News home page

adsolute video ad after first para

కూటమిమేనిఫెస్టోకివిశ్వసనీయతఏదీ?

Published Thu, May 2 2024 3:00 PM

కూటమిమేనిఫెస్టోకివిశ్వసనీయతఏదీ?

గణపవరం: కూటమి పేరుతో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోకు ఎలాంటి విశ్వసనీయత లేదని, 2014లో ఇంతకన్నా ఎక్కువ నమ్మకంతో ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను ఎంతగొప్పగా అమలు చేశారో ప్రజలు గ్రహించాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. మండలంలోని కోమర్రు, డి.కుముదవల్లి, మొయ్యేరు, ముప్పర్తిపాడు, కేశవరం, పిప్పర గ్రామాల్లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలుచోట్ల మహిళలు ఆయనకు హారతులు ఇచ్చి, ఆయనపై పూల వర్షం కురిపించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న ఏకై క లక్ష్యంతో చంద్రబాబు తన గారడీలతో ప్రజలను మాయచేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం వల్లకాడుగా మారుతుందని, అభివృద్ధి లేకుండా పోయిందని మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు అధికారం కోసం అలవికాని హామీలను ఇస్తున్నారని, ఈ హామీలకు ఎలాంటి విలువ ఉంటుందో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు జైజగనన్న, జైవాసన్న అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆయా గ్రామాలలో చర్చి, మసీదు, దేవాలయాలకు వెళ్లి పూజలు, ప్రార్ధనలు చేశారు. ఎస్సీ పేటలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం వైఎస్‌ జగన్‌ సారధ్యంలో రాష్ట్రం సంక్షేమ రాజ్యంగా అవతరించిందని ఐదేళ్ల పాలనలో పేదలకు నూరుశాతం న్యాయం జరిగిందన్నారు. లంచాలు లేకుండా నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు జమచేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, అలాంటి పారదర్శక పాలన జగన్‌తోనే సాధ్యమన్నారు. అభివృద్ది సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లామన్నారు. ఆయా గ్రామాలలో ఇంటింటికి తిరిగి ఐదేళ్లలో పేదల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ది పనులను వివరించారు. ఎంపీపీ అర్ధవరం రాము, జెడ్పీటీసీ సభ్యులు దేవారపు సోమలక్ష్మి, పార్టీ మండల కన్వీనర్‌ దండు రాము, సర్పంచ్‌లు కేశవరపు శైలజ, తూము వీరలక్ష్మి, దుళ్ల కుటుంబరావు, మల్లంపల్లి సురేష్‌, కర్రి రాధాలక్ష్మి, ఎంపీటీసీ వడ్డి సీతామహాలక్ష్మి, విజయలక్ష్మి, పిల్లి సంతోషం, వేగేశ్న విజయ దుర్గానందిని పాల్గొన్నారు.

ఉంగుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి పుప్పాల వాసుబాబు

Advertisement

adsolute_video_ad

homepage_300x250