
ఫర్టిలైజర్స్ దుకాణాల్లో విజిలెన్స్ దాడులు
చెరుకుపల్లి: ఎరువులు, పురుగు మందులు అధిక ధరలకు విక్రయించినా.. అక్రమంగా నిల్వ ఉంచిన చర్యలు తప్పవని గుంటూరు విజిలెన్స్ సీఐలు చంద్రశేఖర్, శివాజీలు దుకాణాదారులను హెచ్చరించారు. మండల కేంద్రంలోని భువనశ్రీ ఫర్టిలైజర్స్, గుప్తా ట్రేడర్స్ ఎరువుల దుకాణాలలో బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఏకకాలంలో మొదలైన విజిలెన్స్ అధికారుల దాడులు అర్ధరాత్రి వరకు నిర్వహించారు. ఈ దాడులు జరుగుతున్నాయని తెలుసుకున్న మండల కేంద్రంలోని ఎరువుల వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. దాడుల వివరాలు తెలియాల్సి ఉంది. కార్యక్రమంలో గుంటూరు అగ్రికల్చర్ ఏఓ ఆదినారాయణ, స్థానిక మండల వ్యవసాయ అధికారి ఎ.మహేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment