
●కటకటకు కౌంట్‌డౌన్
అన్నమయ్య జిల్లాలో 500కు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే వేసవి నేపథ్యంలో తాగునీటి కటకటకు కౌంట్‌డౌన్ మొదలవుతోంది. ప్రధానంగా నందలూరు మండలం పాటూరు గ్రామ పంచాయతీ వెంకట్రాదిపురం ఎస్టీ కాలనీలో గత కొన్నేళ్లుగా తాగునీటి సమస్య ఉన్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. అక్కడున్న ప్రజలు తాగునీటి కోసం ప్రతినిత్యం యుద్ధం చేస్తున్నారు. అక్కడే కాకుండా రాయచోటి, తంబళ్లపల్లె, పీలేరు, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో చాలా గ్రామాల్లో సమస్య ఉత్పన్నమవుతోంది. ఇటీవల అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి కలెక్టరేట్‌కు వచ్చి పలు గ్రామాల ప్రజలు జిల్లాలోని ఉన్నతాధికారురులకు వినతులు సమర్పించారు. రానున్న కాలంలో పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా తాగునీటి సమస్య చాలాచోట్ల ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment