
తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు
తాగునీటి కోసం నారాయణరాజుపేటకు వెళ్లాల్సి వస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నాం. దీంతో రోజువారీగా చేసుకునే పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దయచేసి అధికారులు, ప్రజా ప్రతినిధులు మాకు గుక్కెడు నీరు అందించి అన్ని విధాలా ఆదుకోవాలి. – చిన్నక్క,
వెంకటాద్రిపురం ఎస్టీకాలనీ, పాటూరు
గ్రామపంచాయతీ, నందలూరు మండలం
నీటి సమస్యను సత్వరమే
పరిష్కరించాలి
మా గ్రామంలోని తాగునీటి సమస్యపై ఎన్నోమార్లు నాయకులకు విన్నవించుకున్నా పరిష్కారానికి నోచుకోలేదు. గ్రామంలో ఏర్పాటు చేసిన బోరులో కూడా ఒక్కొక్కసారి నీళ్లు రావడం లేదు. మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. తాగునీటి కోసం అష్ట కష్టాలు పడుతున్నాం. మా సమస్యను పరిష్కరిస్తే అంతే చాలు. – యాసగిరి లక్ష్మీదేవి,
వెంకటాద్రిపురం ఎస్టీ కాలనీ, పాటూరు
గ్రామపంచాయతీ, నందలూరు మండలం

తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు
Comments
Please login to add a commentAdd a comment