
మార్చి నెలాఖరులోపు లక్ష్యం పూర్తి చేయాలి
రాయచోటి (జగదాంబసెంటర్): మార్చి నెలాఖరులోపు జిల్లా సూక్ష్మ నీటి సాగు పథక లక్ష్యాలను పూర్తి చేయాలని ఏపీఎంఐపీ రాష్ట్ర స్థాయి ప్రత్యేకాధికారి డి.రమేష్ పేర్కొన్నారు. బుధవారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని జిల్లా సూక్ష్మ నీటి సాగు పథక కార్యాలయంలో మైక్రో ఇరిగేషన్ కంపెనీ జిల్లా సమన్వయకర్తలు, మైక్రో ఇరిగేషన్ క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యం 15 వేల హెక్టార్లకు ఇప్పటి వరకు 9339 మంది రైతులకు 9694 హెక్టార్లు అమలు చేశామన్నారు. మిగిలిన లక్ష్యాన్ని క్షేత్ర స్థాయిలో ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. నమోదు చేసుకున్న రైతులకు ప్రాథమిక సర్వేలు చేపట్టి, అంచనాలు పూర్తి చేసి రైతుల వాటా కట్టించాలన్నారు. అంతకు ముందు రామాపురం, వీరబల్లి, రాయచోటి మండలాల్లోని పలు గ్రామాల్లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన మైక్రో ఇరిగేషన్ పరికరాలను రైతుల పొలాల్లో సక్రమంగా అమర్చారా లేదా అని తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎంఐఓ లక్ష్మీప్రసన్న, ఎంఐడీసీ, ఎంఐఈలు, కంపెనీ క్షేత్ర స్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఏపీఎంఐపీ రాష్ట్ర స్థాయిప్రత్యేకాధికారి డి.రమేష్
Comments
Please login to add a commentAdd a comment