
రోడ్డు రోలర్ కింద పడి డ్రైవర్ మృతి
ఓబులవారిపల్లె : గోవిందంపల్లి పంచాయతీ, చెన్నకేశవ గుడి సమీపంలోని జాతీయ రహదారి మలుపు వద్ద రోడ్డు రోలర్ కింద పడి డ్రైవర్ దయ్యాల కిరణ్ కుమార్(34) మృతిచెందాడు. బుధవారం మంగళంపల్లి నుండి గాదెల గ్రామానికి రోడ్డు రోలర్ తీసుకొని డ్రైవర్ కిరణ్ కుమార్ బయలుదేరాడు. జాతీయ రహదారిపైకి వచ్చే మలుపు వద్ద రోలర్‌ను అదుపు చేయలేకపోవడంతో కిరణ్ కుమార్ అతను నడిపే వాహనం క్రింద పడి మృతి చెందాడు. మృతుడు కడప పట్టణానికి చెందిన వాడు. గత కొద్దిరోజులుగా రోడ్డు కాంట్రాక్టర్ వద్ద రోలర్‌కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మృతునికి భార్య, ముగుగరు పిల్లలు కలరు. మృతదేహాన్ని రైల్వేకోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ మహేష్ తెలిపారు.
రెండు గడ్డి వాములు దగ్ధం
రామసముద్రం : మండలంలోని కేసీ.పల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. కేసీ పల్లె గ్రామానికి చెందిన ఆర్.చెంగారెడ్డి, పి.చంద్రప్పలకు చెందిన గడ్డివాములకు ప్రమాదవశాత్తూ మంటలు వ్యాపించి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాకపోవడంతో పుంగనూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో రూ.60 వేల నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోయారు.
అక్రమ మద్యంపై నిఘా ఉంచాలి
మదనపల్లె : నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా అక్రమ మద్యం రవాణాపై ఎకై ్సజ్ సిబ్బంది నిఘా ఉంచాలని కడప ప్రొహిబిషన్, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజ్, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి మధుసూదన్ అన్నారు. నియోజకవర్గంలోని రామసముద్రం, చీకలబైలు అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్‌లను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల తనిఖీపై ఎకై ్సజ్ సిబ్బంది పలు సూచనలు చేశారు. కర్నాటక నుంచి ఎన్‌డీపీఎల్ మద్యం అక్రమరవాణా జరగకుండా పటిష్టమైన నిఘా కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐ భీమలింగ, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
మాజీ సీఎం జగన్ రక్షణ.. కూటమి ప్రభుత్వానికి పట్టదా?
ఖాజీపేట : మిర్చి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కనీస రక్షణ కల్పించాల్సిన కూటమి ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించిందని ఏపీఎస్ ఆర్టీసీ కడప జోన్ మాజీ అధ్యక్షుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి విమర్శించారు. దుంపలగట్టు గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు మిర్చియార్డు రైతుల సమస్య తెలుసుకునేందుకు వెళ్లిన జగన్‌కు కనీసం ఒక్క పోలీసును కూడా రక్షణకు నియమించక పోవడం, కనీసం ట్రాఫిక్ క్లియరెన్స్ చేయక పోవడం దురదృష్టకరం అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదని ఎవ్వరికీ మద్దతు ఇవ్వలేదని అన్నారు. అలాంటప్పుడు ఎన్నికల ఆంక్షలు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులకు కనీసం రూ.20వేలు రైతు భరోసాను అందించలేక పోవడం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.

రోడ్డు రోలర్ కింద పడి డ్రైవర్ మృతి

రోడ్డు రోలర్ కింద పడి డ్రైవర్ మృతి

రోడ్డు రోలర్ కింద పడి డ్రైవర్ మృతి
Comments
Please login to add a commentAdd a comment