Sakshi News home page

adsolute video ad after first para

స్కిల్‌ కేసు.. చంద్రబాబుకు సుప్రీంకోర్టు వార్నింగ్‌ !

Published Tue, Apr 16 2024 4:04 PM

Supreme Court Warning To Chandrababu In Skill Case Bail Conditions - Sakshi

ఢిల్లీ,సాక్షి: స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్ షరతులు ఉల్లంఘించొద్దని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సుప్రీంకోర్టు వార్నింగ్‌ ఇచ్చింది. ఈ కేసులో ఏపీ సీఐడీ దాఖలు చేసిన చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం(ఏప్రిల్‌ 16) విచారణ జరిపింది. పిటిషన్‌ తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది.  

బాబు, ఆయన కుమారుడు లోకేష్‌ స్కిల్ కేసు దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారని ఏపీ సీఐడీ తరపు న్యాయవాది సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చారు. ‘దర్యాప్తుకు భంగం కలిగేలా లోకేష్ వ్యవహరిస్తున్నారు. రెడ్‌బుక్‌లో అధికారుల పేర్లు రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల అంతు చూస్తాను అని లోకేష్‌ అంటున్నారు.

ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్‌ బెదిరింపులకు పాల్పడ్డాడు. రెడ్‌బుక్‌ చంద్రబాబుకు ఇస్తారా అని లోకేష్‌ను ఆ టీవీ ఛానల్‌ ప్రతినిధి ఇంటర్వ్యూలో అడిగారు’ అని సీఐడీ వాదనలు వినిపించింది. పిటిషన్‌పై చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. కాగా, గతేడాది స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయిన చంద్రబాబు ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే.  

ఇదీ చదవండి.. శిరోముండనం కేసులో విశాఖ కోర్టు కీలక తీర్పు 

Advertisement

adsolute_video_ad

homepage_300x250