Sakshi News home page

adsolute video ad after first para

FactCheck: సచివాలయంపై తా‘కట్టు కథ’

Published Tue, Mar 5 2024 4:34 AM

Ramoji Rao Eenadu Fake News on AP Secretariat - Sakshi

తనఖా పెట్టుకుని రుణం ఇచ్చినట్లు వచ్చిన వార్తలను ఖండించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 

ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఈ వార్త సృష్టించారని వెల్లడి   

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రతి­ష్టను దిగజార్చే విధంగా ఎల్లో మీడియా చేసిన కుట్ర బట్టబ­యలయ్యింది. రాష్ట్ర తాత్కాలిక సచివాలయాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకు­న్నారంటూ... ఒక పత్రికలో రాసిన కథనాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఖండించింది. ‘సచివా­లయ భవనా­లను తాకట్టు పెట్టుకుని రాష్ట్ర ప్రభు­త్వం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి రూ.370 కోట్లు రుణం తీసుకుంది’ అంటూ ఒక పత్రిక, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చిన వార్త అవాస్త­మని, ఇది ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించేదిగా ఉందని, దానిని ఖండిస్తూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అధికార ప్రతినిధి సోమవారం ప్రకటన విడు­దల చేశారు.

చంద్రబాబును అధికారంలో కూర్చోబెట్టడానికి ఎల్లో మీడియా ప్రతీ రోజు ఏదో ఒక విష ప్రచారంతో భారీ కుట్రలకు తెర­తీస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రతిష్టను మంటకలపడానికి కూడా వెను­కాడటం లేదు. ఇందులో భాగంగానే ‘సచివాలయం తాకట్టు’ అంటూ ఒక విష కథనాన్ని పకడ్బందీగా ప్రచారంలోకి తీసు­కొచ్చింది. ‘తాక­ట్టులో సచి­వాలయం’ అంటూ ఎల్లో పత్రిక ఒక వార్తను ప్రచు­రించడం... దాన్ని తమ సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయ­డం.. దానిపై తెలుగు­దేశం పార్టీ అధినేత నుంచి జిల్లా స్థాయి నేతల వరకు మాట్లాడటం... తిరిగి ఆ వార్తను అన్ని పత్రికల్లో ప్రచు­రింపజేస్తూ... ఒక అబ­ద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా ప్రజలు నిజం అని నమ్మే విధంగా చేయడానికి ఎల్లో మీడియా విశ్వప్ర­యత్నం చేసింది. కానీ ఆ వార్తను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖండించడంతో తెలుగు­దేశం పార్టీ గోబెల్స్‌ ప్రచారం మరో­సారి బట్టబయలయ్యింది.

Advertisement

adsolute_video_ad

homepage_300x250