Sakshi News home page

adsolute video ad after first para

AP Navaratnalu Scheme: నాడు బతుకు భయం.. నేడు కొండంత ధైర్యం..  

Published Tue, Apr 16 2024 2:19 AM

Jagan Mohan Reddy is implementing the Navaratnalu Scheme in AP - Sakshi

అర్చకత్వం వారి వృత్తి. గ్రామంలో ఉన్న శివాలయాన్నే నమ్ముకుని ఓ కుటుంబం జీవిస్తోంది. సొంత భూమి లేదు. కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే శక్తి లేదు. ఆలయానికి చెందిన రెండెకరాల భూమి వేరేవారి ఆదీనంలో ఉంది. దానిపై వచ్చే ఆదాయం అంతంతమాత్రమే. దేవాలయానికి వచ్చే భక్తులు ఇచ్చిన దక్షిణలతోనే వారి కుటుంబపోషణ సాగుతోంది.

దీనికి తోడు పుట్టిన కొడుకు, కూతురు ఇద్దరూ బధిరులే. ఇద్దరిలో కొడుక్కు అతికష్టమ్మీద పెళ్లి చేసినా... కూతురుకు పెళ్లికాక జీవితాంతం తమతోనే గడపాల్సి వస్తోంది. ఆదుకోవాల్సిన గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులనుంచి గట్టెక్కించింది. ఇదీ శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామానికి చెందిన వారణాసి కుమార స్వామి, శ్యామలాంబ కుటుంబ గాథ. 

అడగకుండానే.. అన్నీ ఇచ్చిన జగనన్న ప్రభుత్వం 
2019లో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. ఏదో రకంగా ఏడాది పొడవునా ప్రభుత్వం నుంచి సహాయం అందుతోంది. ఇంటి ఇల్లాలు శ్యామలాంబకు వైఎస్సార్‌ ఆసరా(రుణమాఫీ), వైఎస్సార్‌ సున్నా వడ్డీ, కుమార స్వామికి పింఛన్, కొడుకు, కూతురుకు దివ్యాంగ పింఛన్లు, కొడుకు చంద్రశేఖర్‌ కుట్టు పని నేర్చుకోవడంతో మెషీన్‌ ఉన్నందున జగనన్న చేదోడు అందుతున్నాయి.

అతని భార్య పేరున కాలనీలో ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం అందింది. ఇప్పుడు పనులు పురోగతిలో ఉన్నాయి. వారి పిల్లలు బడికి వెళ్తున్నందున అమ్మ ఒడి నిధులు జమవుతున్నాయి. తమకు ఎలాంటి కష్టం వచ్చినా ఈ ప్రభుత్వం ఆదుకోగలదన్న నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఆ కుటుంబం ఎంతో దర్జాగా బతికేస్తోంది.       –బూర్జ 

సుస్థిర ఆర్థిక వ్యవస్థకు దోహదం 
వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం వచ్చాక అమలు చేస్తు న్న వివిధ రకాల సంక్షేమ పథకాల వల్ల ప్రతీ కుటుంబంలోనూ ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యాయి. రైతులకు వైఎస్సార్‌ రైతుభరోసా వల్ల వ్యవసాయం కోసం అప్పు చేయాల్సిన బాధ తప్పింది. వైఎస్సార్‌ ఆరో గ్యశ్రీ వల్ల నిరుపేదలకు వైద్యం ఉచితంగా అందుతోంది. పిల్లల చదువు తల్లి దండ్రులకు భారం కాకుండా అమ్మ ఒడి, బతుకుపై భరోసా కల్పించేందుకు పింఛన్లు అందుతున్నాయి. ఈ ఆర్థిక సహాయం వల్ల రాష్ట్రంలో సుస్థిర ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతోంది.     – కె.కె.కామేశ్వరరావునాయుడు, ఎకనమిక్స్‌ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, బూర్జ

Advertisement

adsolute_video_ad

homepage_300x250