Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

FactCheck: ఓటమి భయం ప్రస్ఫుటం

Published Fri, Apr 19 2024 4:40 AM

Fact check: Ramoji Rao Eenadu Fake News on AP Police - Sakshi

టీడీపీ ఓటమి ఖాయమనే పోలీసులపై కారుకూతలు 

పోలీసు వ్యవస్థను బ్లాక్‌మెయిల్‌ చేసే కుట్ర 

ఈసీకే పరోక్షంగా ఆదేశాలు జారీ  

రామోజీ పాత్రికేయ పైశాచికం

కుట్రలను ఛేదిస్తూ విజయ తీరాలవైపు వైఎస్సార్‌సీపీ... 

సాక్షి, అమరావతి:  రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం, టీడీపీ ఓటమి ఖాయమని జాతీయ చానళ్ల సర్వే ఫలితాలు విడుదలవుతున్న కొద్దీ ...ఈనాడు రామోజీరావులో పాత్రికేయ పైశాచికత్వం పెట్రేగి పోతోంది. ‘మేమంతా సిద్ధం’ యాత్రలో సీఎం వైఎస్‌ జగన్‌ పట్ల వెల్లువెత్తుతున్న ప్రజాదరణతో రామోజీరావుకు తత్వం మెల్లగా బోధపడుతోంది. జగన్‌కు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం తన తరం కాదన్న   అక్కసుతో ఏకంగా పోలీసు వ్యవస్థనే బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు బరితెగించారు. ఆ కసిలో ఈనాడు పత్రికలో ‘అదే అరాచకత్వం...అదే దౌర్జన్యం’ శీర్షికన గురువారం తాజాగా విష పూరిత కథనాన్ని ప్రచురించారు. రామోజీ రాతలకు అతీతంగా అటు ఈసీ, ఇటు పోలీసు వ్యవస్థ నిబద్ధతతో తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడం సానుకూల పరిణామం.   

కుట్ర బెడిసికొట్టినా ఖాకీలపై ఈనాడు కారుకూతలు... 
 చంద్రబాబు, పురందేశ్వరిల భాగస్వామ్యంతో పోలీసు వ్యవస్థను తమకు గులాంగా చేసుకునే కుట్రలో భాగంగా  ...రాష్ట్రంలో 20 మందికి పైగా ఐపీఎస్‌ అధికారులను మార్చేయాలని ఈనాడు లో కథనాలు రాశారు. రామోజీ పాచిక పారలేదు. డీఐజీ, ఐదుగురు ఎస్పీలను మాత్రమే ఎన్నికల కమిషన్‌ మార్చింది. వారి స్థానాల్లో తాము చెప్పిన వారినే నియమించాలన్నట్టుగా పచ్చ ముఠా పరోక్షంగా ఆదేశాలు జారీ చేసింది.  తద్భిన్నంగా నియమావళి ప్రకారం ఎన్నికల కమిషన్‌ ఒక డీఐజీ, ఐదుగురు ఎస్పీలను నియమించడంతో రామోజీలో అహం దెబ్బతింది.

దీంతో ‘వీళ్లా ఎస్పీలు’ అంటూ  డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు లక్ష్యంగా దు్రష్పచార కథనాన్ని ఈనాడు ప్రచురించింది. ఈ కథనంతో  చిర్రెత్తిన పోలీసు యంత్రాంగం  తీవ్రంగా స్పందించింది. ఏకంగా 19 మంది ఐపీఎస్‌ అధికారులు  టీడీపీ, జనసేన, బీజేపీ, ఈనాడులకు వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఈనాడు తీరుపై మండిపడింది. అంతటితో బుద్ధి రాని  రామోజీ కుక్కతోక వంకరన్నట్లు మరోసారి పోలీసు వ్యవస్థపై విధ్వేషం వెళ్లగక్కారు.

ఈనాడులో వచి్చన ఆదేశాలనే  ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పోలీసులు పాటించాలన్నట్టుగా బ్లాక్‌మెయిలింగ్‌కు దిగజారారు. టీడీపీ దౌర్జన్యాలు, దాడులను మసిపూసి మారేడు కాయ చేస్తూ వైఎస్సార్‌సీపీపై బురద జల్లేందుకు యతి్నంచారు.  వైఎస్సార్‌సీపీలో ఫలానా నేతలపై ఫలానా సెక్షన్ల కింద కేసులు పెట్టండంటూ పోలీసులకు రామోజీ తన రాతల హుకుం జారీ చేశారు.  

పోలీసు అధికారుల బెదిరింపునకూ పన్నాగం 
తాజాగా ఎన్నికల విధుల్లో  క్రియాశీలంగా ఉండే డీఎస్పీ, సీఐ, ఎస్సైలను బ్లాక్‌మెయిల్‌ చేయడం ద్వారా టీడీపీ అక్రమాలకు అడ్డులేకుండా చేయాలన్న పచ్చ కుట్రలో రామోజీ భాగస్వామిగా మారారు. ఇటీవల పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు దౌ ర్జన్యాలకు పాల్పడ్డ ఉదంతాలను ఈనాడు  వక్రీకరిస్తూ తప్పుడు కథనం ప్రచురించింది. మాచర్ల, గన్నవరం, అద్దంకి, ఉరవకొండ, గుడివాడ తదితర నియోజకవర్గాల్లో గత వారం పదిరోజుల్లో టీడీపీ కార్యకర్తలు దౌర్జ న్యాలకు పాల్పడ్డారు.

తాజాగా బుధవారం రాత్రి ఒంగోలులో ఎన్నికల ప్రచారంలో ఉన్న  వైఎస్సార్‌సీపీ అ భ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఆయన కుటుంబ స భ్యులనే అడ్డుకున్నారు. అసలు ఎన్నికల ప్రచారం చే యడానికి వీల్లేదని గలాభా సృష్టించారు. ఈ ఘటనల పై స్థానిక పోలీసులకు ఫిర్యాదులు అందడంతో వారు కఠిన చర్యలు తీసుకున్నారు. టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడినా.. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల ప్రచా రా న్ని అడ్డుకున్నా పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి చూ స్తుండాలన్నట్టుగా ఈనాడు వితండవాదం చేస్తోంది. 

ఈసీనే శాసిస్తున్న రామోజీ రాతలు...   
ఏకంగా రాజ్యంగబద్ధ సంస్థ ఈసీకే పరోక్షంగా తన రాతలతో ఆదేశాలు జారీ చేస్తుండటం రామోజీరావు బరితెగింపునకు నిదర్శనం.  ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ఏకంగా ఎస్పీలను మారిస్తే సరిపోతుందా... మొత్తం డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను మార్చేయాలని ఈసీకే రాతల హుకుం జారీ చేశారు. అందర్నీ మారుస్తామన్నారు..ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈసీనే  ఈనాడు  నిలదీయడాన్ని ప్రజాస్వామ్యవాదులే ఛీత్కరించుకుంటున్నారు. ఈసీ కొత్తగా నియమించిన పల్నాడు ఎస్పీపైనా ఈనాడు విషం కక్కింది. అయినా రామోజీ రాతలకు అతీతంగా ఈసీ తన పని తాను పక్షపాత రహితంగా చేసుకుపోతోంది.

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250