
1 నుంచి ఇంటర్ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారంతో ప్రాక్టికల్ పరీక్షలు ముగియడంతో థియరీ పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు. మార్చి 20 వరకు థియరీ పరీక్షలుంటాయి. జిల్లా వ్యాప్తంగా 63 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనరల్, ఒకేషనల్ కలిపి 48,690 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 25,730 మంది కాగా 12,397 మంది బాలురు, 13,333 మంది బాలికలు ఉన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 22,960 మంది కాగా వీరిలో 11,064 మంది బాలురు, 11,896 మంది బాలికలు ఉన్నారు. పరీక్ష ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరుతున్నాయి. స్థానిక కొత్తూరు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో భద్రపరుస్తున్నారు. పరీక్షలపై ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూం (నం.08554– 274256) ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షల సమయంలో ప్రశ్రపత్రాలను లీక్ చేస్తే అడ్డంగా దొరికిపోతారు. ప్రశ్నాపత్రాలపై క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. పొరపాటున బయట ప్రశ్నపత్రం దొరికిందా... దానిపై ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే అది ఏ కేంద్రానికి కేటాయించిందో ఇట్టే తెలిసిపోతుంది.
వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు..
విద్యార్థులు హాల్‌టికెట్లు https://bie.ap.gov.in వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజులకు, హాల్ టికెట్లకు ముడిపెట్టొద్దని, ఎవరైనా బలవంతం చేస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, ఇంటర్ బోర్డు ఆర్‌ఐఓ ఎం. వెంకటరమణనాయక్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలను ముందురోజే వెళ్లి సంబంధిత కళాశాల యాజమాన్యంతో నిర్ధారించుకోవాలని సూచించారు.
వర్సిటీ పురోగతికి సమష్టి కృషి
అనంతపురం: జేఎన్‌టీయూ(ఏ) పురోగతికి సమష్టిగా కృషి చేద్దామని నూతన వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు అన్నారు. బుధవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీనియర్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్సిటీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ప్రతి ఉద్యోగి సహకారంతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు.

1 నుంచి ఇంటర్ పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment