అహుడా వార్డు ప్లానర్ అనుమానాస్పద మృతి
అనంతపురం: అహుడాలో వార్డు ప్లానర్‌గా పనిచేస్తున్న నాగశ్రీ(38) అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతపురంలోని మారుతీనగర్‌లో నివాసముంటున్న ఆమె తన ఇంట్లోనే మంగళవారం ఉరికి వేలాడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు గమనించి పెద్దాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అత్యవసర వైద్య విభాగంలో చేర్చారు. చికిత్సకు స్పందించక బుధవారం ఆమె మృతిచెందింది. కాగా, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రీ సర్వే పారదర్శకంగా సాగాలి
● జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ
నార్పల: గ్రామాల్లో రీ సర్వే పనులు పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జేసీ శివ్‌నారాయణ్ శర్మ ఆదేశించారు. నార్పల మండలం దుగుమర్రిలో చేపట్టిన రీ సర్వే పనులను బుధవారం ఆయన పరిశీలించారు. గ్రామ సరిహద్దులు, బ్లాక్ సరిహద్దులు, ప్రభుత్వ స్థలాల సరిహద్దులు పక్కగా నిర్ణయించాలన్నారు. రీ సర్వే చేసే గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. వారి సమక్షంలోనే రీసర్వే పనులు చేపట్టాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.
హంద్రీ–నీవా లైనింగ్ పనుల అడ్డగింత
కనగానపల్లి: హంద్రీ–నీవా కాలువ సిమెంట్ లైనింగ్ పనులను రైతులు అడ్డుకున్నారు. ఎవరికో మేలు చేసేందుకు తమకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. తగరకుంట సమీపంలోని హంద్రీ–నీవా కాలువ వద్ద లైనింగ్ పనులు చేపట్టేందుకు బుధవారం కాంట్రాక్టర్లు యంత్రాలతో రాగా, విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు అక్కడికి వెళ్లి పనులు చేపట్టకూడదన్నారు. కూటమి ప్రభుత్వం హంద్రీ–నీవా కాలువ ద్వారా చిత్తూరు జిల్లాకు కృష్ణాజలాలు తరలించేందుకు తమకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కాలువ వెడల్పు, జంగిల్ క్లియరెన్స్‌కు తాము వ్యతిరేకం కాదన్నారు. కానీ కాలువలో సిమెంట్ వేసి లైనింగ్ చేస్తే ఒప్పుకోబోమన్నారు. కార్యక్రమంలో తగరకుంట, పాతపాల్యం గ్రామాల సర్పంచ్‌లు మాధవరాజులు, రాజాకృష్ణ, పలువురు రైతులు పాల్గొన్నారు.
అహుడా వార్డు ప్లానర్ అనుమానాస్పద మృతి
Comments
Please login to add a commentAdd a comment