
బాధిత కుటుంబానికి ఆర్థిక ఆసరా
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్న దళిత సేవా సంఘం సభ్యులు
దేవరాపల్లి: మండలంలోని తెనుగుపూడి దళిత సేవా సంఘం సభ్యులు తమ మానవత్వం చాటుకున్నారు. ఇటీవల దళిత నిరుపేద కుటుంబానికి చెందిన ముప్పిన అప్పారావు తండ్రి జవాలు మరణించాడు. దీంతో పెద్ద దిక్కును కోల్పోయి ఆసరా కోసం ఎదురు చూస్తున్న బాధిత కుటుంబానికి దళిత సేవా సంఘం సభ్యులు రూ. 5 వేలు అందించి అండగా నిలిచారు. ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడమే ధ్యేయంగా దళిత సేవా సంఘం పని చేస్తుందని సంఘ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment