
సీనియర్ నాయకులకు గుర్తింపు ఇవ్వాలి
అనకాపల్లి: నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీని నమ్ముకున్న తెలుగు తమ్ముళ్లకు గుర్తింపు లేకుండా పోయిందని టీడీపీ కోర్ కమిటీ సభ్యుడు బోడి వెంకటరావు యాదవ్, మాజీ కౌన్సిలర్ కుప్పిలి జగన్మోహనరావు, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోట్ని రామకృష్ణదొర విశాఖలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు బుధవారం వినతిపత్రం అందజేశారు. అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీని బతికించాలని, పార్టీలో కార్యకర్తలను గుర్తించే సరైన న్యాయకత్వం లేకుండా పోయిందన్నారు. ఎన్టీఆర్ దైవంగా, పార్టీని తల్లిగా నమ్మి నేటి వరకూ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఏనాడూ పార్టీ జెండా పట్టుకోని వ్యక్తులకు పదవులు ఇవ్వడం బాధాకరం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment