
మైదానంలో జాఫ్రా సిరులు
నాతవరం మండలంలో 200 ఎకరాల్లో సాగు
సుందరకోటలో పంట దశలో ఉన్న జాఫ్రా తోటలు
నాతవరం: గిరిజన ప్రాంతంలో పండించే జాఫ్రా గింజలకు ఉహించని రేటు లబించడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయనప్పటికీ ప్రైవేటు వ్యాపారులు ముందుకు వచ్చి అధిక రేట్లకు జాఫ్రా గింజలు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది జాఫ్రా గుబడితో పాటు రేటు బాగుండడంతో అధిక ఆదాయం వస్తుందని గిరిజనులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విరివిగా తోటల సాగు..
మండలంలో సరుగుడు పంచాయతీ శివారు రామన్నపాలెం, అచ్చంపేట, యరకంపేట, మాసంపల్లి , రాజవరం, దద్దుగుల సుందరకోట పంచాయతీ శివారు కొత్త సిరిపురం, కొత్త దద్దుగుల, తొరడ, సుందరకోట, అసనగిరి, ముంతమామిడిలొద్దు, బమ్మిడికలొద్దు, సిరిపురం, కొత్త లంకలు తదితర గిరిజన ప్రాంతంలో జాఫ్రా తోటలు సాగు చేస్తున్నారు. వీటితో పాటు కొండల దిగువనున్న ప్రాంతాల్లో కె.వి.శరభవరం, కొండ ధర్మవరం, చమ్మచింత, పొట్టినాగన్నదొరపాలెం, కృష్ణాపురం గ్రామాల్లో గిరిజనులు జాఫ్రా తోటలు పెంచుతున్నారు. మండల వ్యాప్తంగా సుమారుగా 200 ఎకరాల పైగా జాఫ్రా తోటలు సాగు చేస్తున్నారు. ఈ తోటలు అఽధికంగా వ్యవసాయ భూముల గట్లు మీద జీడి మామిడి తోటలు మద్య అంతర పంటగా సాగు చేస్తుంటారు. జాఫ్రా తోటకు నీటి వసతి లేకపోయినప్పుటికీ ఆడపాదడపా కురిసే వర్షాలకు ఈతోటలు ఏపుగా పెరుగుతుంటాయి. వీటికి తెగుళ్లు కూడా అంతంత మాత్రమే. తోటలకు గిరిజనులు ఎక్కడా క్రిమిసంహారక మందులు పిచికారి చేయలేదు.
రంగుల కోసం వినియోగం..
ఈ ఏడాది ఎకరం జాఫ్రా తోట నుంచి గింజలు 800 నుంచి 1000 కేజీల మధ్య దిగుబడులు వచ్చాయని గిరిజనులు అంటున్నారు. ఇటీవల కాలంలో ఇంత అధిక మొత్తంలో దిగుబడులు రాలేదంటున్నారు. అధిక దిగుబడి రావడానికి ప్రధాన కారణం గత ఏడాది ఖరీ్‌ఫ్ సీజన్‌లో కొండలపై అధికంగా వర్షాలు కురియడమే కారణంగా భావిస్తున్నారు. దిగుబడితో పాటు రేటు కూడా కేజీకి నాణ్యతను బట్టి రూ.250 నుంచి రూ.300 వరకు ప్రవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేస్తే మరింత రేటు పెరుగుతుందని గిరిజనులు ఆశిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రైవేటు వ్యాపారులు వచ్చి గిరిజనులు రైతుల నుంచి నేరుగా జాఫ్రా గింజలు కొనుగోలు చేస్తున్నారు. జాఫ్రాను ఇళ్లకు ఉపయోగించే పెయింటింగ్‌కు, దుస్తుల రంగులకు అధికంగా వినియోగిస్తుంటారు. ఇతర రంగుల కంటే జాఫ్రా పింకులు రంగులు నాణ్యతతో పాటు ఆకర్షణీయంగా ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే వివిధ రకాలకు చెందిన పెయింటింగ్ కంపెనీల నుంచి కూడా డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు.
ఆదాయం బాగుంది
ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జాఫ్రా ద్వారా ఆదాయం బాగా వచ్చింది. సుందరకోటలో 50 సెంట్ల విస్తీర్ణంలో 435 కేజీల జాఫ్రా గింజలు పండాయి. రేటు రూ.245 నుంచి రూ.300 వరకు విక్రయించాను. ఇంత ఆదాయం వస్తుందని ఊహించలేదు. పాడేరు ఐటీడీఏ గిరిజన కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేస్తే మరింత రేటు వచ్చే అవకాశం ఉంటుంది.
–బత్తుల కృష్ణ, రైతు, సుందరకోట గ్రామం

మైదానంలో జాఫ్రా సిరులు

మైదానంలో జాఫ్రా సిరులు
Comments
Please login to add a commentAdd a comment