breaking news
-
సునీతా కేజ్రీవాల్ ‘నియంతృత్వం’ విమర్శలపై బీజేపీ కౌంటర్
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు.. తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. కోర్టు ఆయనకు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అలాగే తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘సీఎం కేజ్రీవాల్‌ను జైలుకు ఎందుకు పంపారు?. వారికి( బీజేపీ) ఒక్కటే లక్ష్యం ఉంది..లోక్‌సభ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్లో జైలులోనే ఉంచటం. దేశ ప్రజలు ఇలాంటి నియంతృత్వానికి గట్టి సమాధానం చెబుతారు’ అని సునీతా కేజ్రీవాల్ అన్నారు. సునీతా కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజీపీ కౌంటర్ ఇచ్చింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సునీతా కేజ్రీవాల్‌ను రబ్రీదేవీతో పోల్చారు. ‘రబ్రీదేవి సిద్ధమవుతోంది. గత వారం, పది రోజుల్లో ఇప్పటికే మూడు, నాలుగు సార్లు చెప్పాను. రబ్రీ త్వరలో మనముందుకు వస్తుంది. అంటే నేను అనేది..సునీతా కేజ్రీవాల్ సీఎంగా రాబోతుంది. అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఇద్దరు నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌తో కేబినెట్ చర్చలు జరుపుతున్నారు. ఏ ప్రభుత్వమైనా జైలు నుంచి నడపుతారా? ఇక్కడి ప్రభుత్వంలో మాత్రం ముగ్గురు మంత్రులు జైలులో ఉన్నారు. వారు అక్కడే కేబినెట్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు’ అని హర్దీప్ సింగ్ పూరి ఎద్దేవా చేశారు. ఇక.. అవినీతి కేసులో ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ జైలు వెళ్లినప్పుడు ఆయన భార్య రబ్రీదేవి సీఎం అయిన విషయం తెలిసిందే. -
‘రబ్రీ 2.0’.. కేజ్రీవాల్ సతీమణిపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు
లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడం, పార్టీలో కీలక నేతలు కూడా జైల్లో ఉండటంతో కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ అన్నీ తానై నడిపిస్తున్నారు. జైలు నుంచి కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని ఆమె ప్రజలకు చదివి వినిపించారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ సీఎం అవుతారని మీడియా కథనాలు వస్తున్నాయి. జైలు నుంచి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయడంపై బీజేపీ తీవ్ర విమర్శలతో దాడి చేస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన కొనసాగిస్తారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రకటన ఢిల్లీ ప్రజలకు, చట్టానికి, ప్రజాస్వామ్యానికి అవమానకరమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. ‘అప్పుడు బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్లినప్పుడు ఆయన సతీమణి రబ్రీదేవిని ముందు పెట్టి నడిపించారు. ఇప్పుడు రబ్రీ 2.0 సమయం వచ్చింది’ అన్నారు. -
ఎమ్మెల్సీలుగా నితీశ్, రబ్డీ దేవి ఏకగ్రీవం
పట్నా: బిహార్ శాసనమండలి సభ్యులుగా సీఎం నితీశ్ కుమార్, మాజీ సీఎం రబ్డీ దేవి సహా 10 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్జేడీకి చెందిన రబ్డీ దేవి శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కేబినెట్ మంత్రి సంతోష్ సుమన్ కూడా మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఉన్నారు. జేడీయూ చీఫ్ కూడా అయిన నితీశ్ కుమార్ గురువారం పార్టీ నాయకులతో శాసనమండలి సెక్రటేరియట్‌కు చేరుకుని ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. -
Land for jobs scam: ప్రత్యేక కోర్టులో రబ్డీదేవికి ఊరట
న్యూఢిల్లీ: రైల్వే శాఖలో ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో బిహార్ మాజీ సీఎం రబ్డీదేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లకు ప్రత్యేక కోర్టు ఈ నెల 28వ తేదీ వరకు మధ్యంతర బెయిలిచి్చంది. రెగ్యులర్ బెయిల్ కోసం వీరు పెట్టుకున్న పిటిషన్‌పై స్పందన తెలపాలంటూ ఈడీని ఆదేశిస్తూ స్పెషల్ జడ్జి విశాల్ గొగ్నె తీర్పు వెలువరించారు. కేసు దర్యాప్తు సమయంలో నిందితులను అరెస్ట్ చేయకుండా ఇప్పుడు కస్టడీకి కోరడమెందుకని జడ్జి ఈ సందర్భంగా ఈడీని ప్రశ్నించారు. -
ఈడీ ముందుకు లాలూ కొడుకు
పాట్నా: ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ హాజరయ్యారు. పాట్నాలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ఈడీ కార్యాలయం ముందు ఆర్జేడీ కార్యకర్తలు భారీగా గుమిగూడారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. లాలూ కొడుకు తేజస్వీ యాదవ్ ఇంట్లోనూ ఈడీ దాడులు జరిపింది. నిన్న లాలూని 9 గంటలపాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో తమ ఆరోపణలు నిజమేనని స్పష్టం చేసింది. అక్రమంగా రైల్వే ఉద్యోగాలు ఇచ్చి లంచాలు తీసుకున్నట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ భార్య రబ్రి దేవి గోశాలలో పనిచేసే వ్యక్తి పేరుపై మొదట రైల్వే ఉద్యోగుల నుంచి లంచాలు పుచ్చుకున్నారని ఈడీ దర్యాప్తులో తేలింది. అనంతరం ఆ ఆస్తుల్ని లాలూ కూతురు హేమా యాదవ్‌కు బదిలీ చేశారని వెల్లడైంది. ఏకే ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏబీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ షెల్ కంపెనీలకు నిధుల్ని బదిలీ చేశారని ఈడీ అధికారులు గుర్తించారు. ఆయా కంపెనీల షేర్లు లాలూ కుటుంబ సభ్యులకు బదిలీ అయ్యాయని పేర్కొన్నారు. అమిత్ కత్యాల్ అనే వ్యక్తి లాలూ ప్రసాద్ యాదవ్ కోసం ఈ కంపెనీలను నిర్వహించాడని ఈడీ దర్యాప్తులో బయటపడింది. ఇదీ చదవండి: Jharkhand CM Hemant Soren: జార్ఖండ్ సీఎం ఎక్కడ? 18 గంటలుగా మాయం?
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019