Prakasam District News
-
No Headline
అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అరకొరగా అందుతోంది. పేదల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలకు కూటమి ప్రభుత్వం ఎసరుపెడుతోంది. కందిపప్పు పంపిణీకి బ్రేక్ పడగా, ఇతర సరుకులు సైతం సకాలంలో అందడంలేదు. మరో వైపు రేషన్ డీలర్లు సైతం చేతివాటం చూపిస్తుండడంతో పౌష్టికాహారం అందని ద్రాక్షగా మారుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కేంద్రాలకు మహర్దశ పట్టగా కూటమి ప్రభుత్వంలో సేవలు మృగ్యమవుతున్నాయి. -
కందిపప్పు ఆలస్యంగా ఇస్తాం
ఆగస్టు నెలకు సంబంధించి కందిపప్పు సరఫరా కాలేదు. సెప్టెంబర్ నెలకు సంబంధించి ప్రొక్యూర్మెంట్ స్థానికంగా చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. త్వరలో టెండర్లు పిలుస్తున్నాం. కందిపప్పు సరఫరాకు కొంత ఆలస్యం కావచ్చు. డీసీపీ (డిస్టిక్ పర్చస్ కమిటీ) నిర్ణయం మేరకు జిల్లా స్థాయిలోనా..లేక ప్రాజెక్టు స్థాయిలోనా అనేది నిర్ణయం తీసుకుని టెండర్లు పిలుస్తారు. ఆన్లైన్లో అంగన్వాడీ వర్కర్లు చూపిన నివేదికల ప్రకారమే కేంద్రాలకు సరుకులు సరఫరా చేస్తారు. కేంద్రాల్లో చూపించిన బ్యాలెన్స్‌ను తగ్గించి.. నెలవారీ ఇండెంట్ కేటాయిస్తారు. కేంద్రాల్లో అంగన్వాడీ వర్కర్లు కచ్చితంగా ఆన్లైన్ నివేదికలు ఇచ్చినా...రేషన్ డీలర్లు సరుకులు తక్కువ చేసి ఇస్తే.. ఆ డీలర్లపై ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటాం. – మాధురి, ఐసీడీఎస్ పీడీ, ఒంగోలు