breaking news
-
18 ఓటీటీలపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: అసభ్యకర, అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేసినందుకుగాను 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, వాటికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయనున్నట్లు కేంద్రం గురువారం తెలిపింది. 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, వీటికి సంబంధం ఉన్న 19 వెబ్సైట్లు, 10 యాప్‌లు, 57 సోషల్ మీడి యా ఖాతాలను దేశంలో ఇకపై ప్రజలకు అందుబాటులో ఉండవని పేర్కొంది. తొలగించే 10 యాప్‌లలో ఏడు గూగుల్ ప్లే స్టోర్, 3 యాపిల్ యాప్ స్టోర్‌లో ఉండేవి. వేటుపడిన 18 ఓటీటీలివే.. డ్రీమ్స్ ఫిలిమ్స్, వూవీ, యెస్మా, అన్‌కట్ అడ్డా, ట్రీఫ్లిక్స్, ఎక్స్ప్రైమ్, నియోన్ ఎక్ వీఐపీ, బేషరమ్స్, హంటర్స్, రబ్బిట్, ఎక్స్‌ట్రామూడ్, న్యూఫ్లిక్స్, మూడ్ ఎక్స్, మోజోఫ్లిక్స్, హాట్ షాట్స్ వీఐపీ, ఫుగీ, చికూఫ్లిక్స్, ప్రైమ్ప్లే వంటి ఓటీటీ సోషల్ మీడియా ఖాతాలను తొలగించారు. తొలగించిన వాటిలో 12 ఫేస్బుక్ ఖాతాలు, 17 ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, 16 ఎక్స్ ఖాతాలు, 12 యూట్యూబ్ ఖాతాలు సోషల్ మీడియా ద్వారా అశ్లీలతను ప్రసారం చేస్తున్నాయి. -
ఓటీటీని ఆస్వాదిస్తున్న నెటిజన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ వినియోగదార్లలో 86 శాతం మంది ఓటీటీ (ఓవర్ ది టాప్) ఆడియో, వీడియో సేవలను ఆస్వాదిస్తున్నారు. వీరిలో సగానికిపైగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారని ఓ నివేదిక వెల్లడించింది. లక్షదీ్వప్ మినహా కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన 90,000 పైచిలుకు గృహాల నుంచి సమాచారాన్ని సేకరించి నివేదికలో పొందుపరిచారు. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ (ఐఎంఏ), మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ కంపెనీ కాంటార్ సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. స్మార్ట్ టీవీ, స్మార్ట్ స్పీకర్స్, ఫైర్‌స్టిక్స్, క్రోమ్కాస్ట్ల పెరుగుదల ద్వారా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ సేవలు 2021తో పోలిస్తే 2023లో 58 శాతం ఎగసింది. 18.1 కోట్ల మంది సంప్రదాయ టీవీ వీక్షణ సాగిస్తే, ఇంటర్నెట్ ఆధారిత పరికరాల ద్వారా వీడియో కంటెంట్‌ను 20.8 కోట్ల మంది ఆస్వాదిస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం ఇలా.. ఇంటర్నెట్ వినియోగదార్లలో కమ్యూనికేషన్స్ కోసం 62.1 కోట్ల మంది, సామాజిక మాధ్యమాలను 57.5 కోట్ల మంది వాడుతున్నారు. 2023 నాటికి యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య భారత్‌లో 82.3 కోట్లు ఉంది. జనాభాలో 55 శాతంపైగా గతేడాది ఇంటర్నెట్ వాడారు. 2022తో పోలిస్తే గతేడాది ఈ సంఖ్య 8 శాతం ఎక్కువ. మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో గ్రామీణ ప్రాంతాల వారు అత్యధికంగా 44.2 కోట్ల (53 శాతంపైగా) మంది ఉన్నారు. స్థానిక భాషల్లో కంటెంట్‌ను వీక్షించేందుకే 57 శాతం యూజర్లు మొగ్గు చూపుతున్నారు. తమిళం, తెలుగు, మలయాళం భాషలకు అధిక డిమాండ్ ఉంది. ఇక 2015లో మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో పురుషులు 71 శాతం కాగా, స్త్రీలు 29 శాతం నమోదయ్యారు. 2023లో పురుషుల వాటా 54 శాతానికి వచ్చి చేరింది. స్త్రీల వాటా 46 శాతానికి ఎగసింది. దేశంలోని లింగ నిష్పత్తికి దాదాపు సమంగా ఉంది. -
లావణ్య మిస్ పర్ఫెక్ట్
లావణ్యా త్రిపాఠి, అభిజీత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘న్యూ ఇయర్‌ను పర్ఫెక్ట్గా మొదలు పెట్టబోతున్నాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు లావణ్యా త్రిపాఠి. ‘‘ప్రతి పనిని పర్ఫెక్ట్గా చేసే మిస్టర్ పర్ఫెక్ట్ల గురించి మాట్లాడుకుంటుంటాం. కానీ మిస్ పర్ఫెక్ట్గా ఓ అమ్మాయి ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది? ఎలా పని చేయిస్తుంది? అనే అంశాలను హిలేరియస్‌గా ఈ వెబ్ సిరీస్‌లో చూపించబోతున్నాం’’ అన్నారు విశ్వక్ ఖండేరావ్. ‘‘అనుకోకుండా ఏర్పరచుకునే కొన్ని అనుబంధాలు మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? అనే ప్రేమకథతో ‘మిస్ పర్ఫెక్ట్’ని రూపొందించాం’’ అన్నారు సుప్రియ యార్లగడ్డ. ఈ సిరీస్‌కు సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి, కెమెరా: ఆదిత్య జవ్వాదా. -
దూత ఓ కొత్త అనుభూతి
‘‘థ్యాంక్యూ’ సినిమా తర్వాత ‘దూత’ వెబ్ సిరీస్ గురించి నాగచైతన్యతో చెప్పాను. హారర్, థ్రిల్లర్ నేపథ్యం అంటే నాకు భయం అన్నాడు. కథ వినమన్నాను. ఆ తర్వాత కథ నచ్చడంతో చేస్తానని చెప్పాడు. సూపర్ నేచురల్, ఊహాతీతమైన అంశాలతో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అని డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ అన్నారు. హీరో నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ ‘దూత’. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీశంకర్, ్రపాచీ దేశాయ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శరత్ మరార్ నిర్మించిన ఈ సిరీస్ డిసెంబరు 1 నుంచి అమేజాన్‌లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎనిమిది ఎపిసోడ్స్‌గా ప్రసారం కానుంది. ఈ సందర్భంగా విక్రమ్ కె. కుమార్ చెప్పిన విశేషాలు. ► ‘దూత’ పూర్తిగా కల్పిత కథ. ‘దూత’ అంటే ఏదైనా సమాచారాన్ని చేరవేసేవాడు. ఇందులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సాగర్ పాత్రలో నాగచైతన్య అద్భుతంగా నటించాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంటేనే సవాల్‌తో కూడుకున్నది. సంచలనం సృష్టించిన ఓ ఘటన తాలూకు వాస్తవాలను సాగర్ ఎలా పాఠకుల ముందు ఉంచాడు? ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి మలుపులు ఎదురయ్యాయి? అనేది ప్రేక్షకులు అంచనా వేయలేరు. తన కంఫర్ట్ జోన్ నుండి బయటకి వచ్చి, ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రని సవాల్‌గా తీసుకుని చేశాడు నాగచైతన్య. ►‘దూత’లో మూడు సినిమాలు తీసేంత కథ ఉంది. అందుకే వెబ్ సిరీస్‌గా తీశాం. పైగా సినిమాగా తీస్తే మన ప్రేక్షకులకు మాత్రమే చేరువ అవుతుంది. ఓటీటీలో ప్రసారం చేయడం ద్వారా ఇతర దేశాల్లోని వారు కూడా మన ఇండియన్ వెబ్ సిరీస్‌లు చూసే అవకాశం ఉంటుంది. ►షార్ట్ ఫిలిం, వెబ్ ఫిల్మ్, సినిమా.. దేని కష్టం దానికి ఉంటుంది. అయితే సినిమా తీయడం సులభమే.. కానీ, మంచి మూవీ తీయడం చాలా కష్టం. -
ఓటీటీలు డబ్బు కట్టకుండా 5జీని వాడుకుంటున్నాయ్
న్యూఢిల్లీ: ఓవర్ ది టాప్ (ఓటీటీ) సంస్థలు ఎలాంటి చెల్లింపులు చేయకుండా 5జీ నెట్‌వర్క్‌ను వాడుకుంటున్నాయని సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ ఆరోపించారు. వాటిని వాడుకుంటున్నందుకు గాను ఆయా సంస్థలు తమకు వచ్చే లాభాల్లో కొంతైనా టెల్కోలకు చెల్లించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘టెల్కోలు తమ వాయిస్, డేటా ట్రాఫిక్ కోసం నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తాయి. అయితే, ఓటీటీ సంస్థలు మాత్రం భారీ డేటా చేరవేత కోసం ఈ నెట్‌వర్క్‌లపై పెను భారం మోపుతున్నాయి. కంటెంట్ ప్రొవైడర్స్ నుంచి తీసుకున్న డేటాను తమ ప్లాట్‌ఫాం ద్వారా యూజర్లకు చేరవేస్తాయి. ఈ ప్రక్రియలో ఉపయోగించుకునే నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిన సంస్థలకు మాత్రం పైసా చెల్లించడం లేదు‘ అని కొచర్ చెప్పారు. ఓవైపున 5జీ వంటి అధునాతన టెక్నాలజీ నెట్‌వర్క్‌ల ఏర్పాటు కోసం భారీగా పెట్టుబడులు పెట్టలేక టెల్కోలు ఆర్థికంగా కష్టాలు పడుతుంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మాత్రం వాటితో లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సదరు నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసి, నిర్వహిస్తున్నందుకు గాను టెల్కోలకు ఓటీటీలు తమకు వచ్చే లాభాల్లో సముచిత వాటాను ఇవ్వాలని కొచర్ పేర్కొన్నారు. నెట్‌వర్క్‌లు, డిజిటల్ కనెక్టివిటీ, స్మార్ట్ఫోన్ల వినియోగం మెరుగుపడిన నేపథ్యంలో భారత్‌లో వీడియో ఓటీటీ మార్కెట్ 2030 నాటికి 12.5 బిలియన్ డాలర్లకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, సోనీలైవ్ వంటి ఓటీటీ సంస్థలకు భారత్‌లో పెద్ద సంఖ్యలో యూజర్లు ఉన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019