breaking news
-
అరెస్ట్ వారెంట్ జారీ, త్వరలో జైలుకి మాజీ సీఎం ‘లాలూ’?
పాట్నా : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మధ్య ప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ నగర ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఆయన మరోసారి జైలు శిక్షను అనుభవించనున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్వాలియర్‌లోని కోర్టులో కొనసాగుతున్న అక్రమ ఆయుధాల కొనుగోలుకు సంబంధించిన కేసు నిందితుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఒకరు. ఆయుధ చట్టం కింద 30 ఏళ్ల నాటి కేసుకు సంబంధించి గ్వాలియర్ ప్రత్యేక కోర్టు ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు చట్టపరమైన చిక్కుల్ని ఎదుర్కోనున్నారు. 30 ఏళ్ల నాటి కేసు 1997లో మధ్యప్రదేశ్ పోలీసులు అక్రమ ఆయుధాల కేసును నమోదు చేశారు. ఇందులో నిందితులుగా 22 మందిని చేర్చారు. అయితే, ఆ నిందితులు గ్వాలియర్‌లోని మూడు వేర్వేరు సంస్థల నుంచి ఆయుధాలను కొనుగోలు చేసి 1995 నుంచి 1997 మధ్య కాలంలో బీహార్‌లో విక్రయించినట్లు అభియోగాలు మోపారు పోలీసులు. అందుకు తగ్గ ఆధారాల్ని కోర్టు ముందుంచారు. అప్పటి నుంచి గ్వాలియర్ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతుంది. నిందితుల్లో లాలూ ఒకరు మొత్తం 22 మంది నిందితుల్లో 14 మంది పరారీలో ఉండగా, ఆరుగురు విచారణలో ఉండగా, ఇద్దరు చనిపోయారు. ఈ కేసులో అభియోగాలు మోపబడి పరారీలో ఉన్న 14 మందిలో ఒకరే లాలూ ప్రసాద్ యాదవ్. తాజాగా, గ్వాలియర్‌లోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు అక్రమ ఆయుధాల కేసుపై విచారణ చేపట్టింది. విచారణ అనంతరం కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
పట్టు వదలని పప్పూ యాదవ్.. లాలూకు రిక్వెస్ట్!
పాట్నా: కాంగ్రెస్‌లో తన జన్ అధికార్ పార్టీ (జేఏపీ)ని విలీనం చేసిన మాజీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్.. పూర్నియా లోక్‌సభ సీటుపై పట్టు వదిలేలా కనిపించడం లేదు. నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని పట్టుదలతో ఉన్న ఆయన వైఖరి బిహార్‌లో మహాకూటమిపై ఒత్తిడి తెస్తోంది. రాష్ట్రీయ జనతాదళ్ ( ఆర్జేడీ ) , కాంగ్రెస్, వామపక్షాలతో సహా బిహార్‌లో విపక్షాల కూటమి మహాఘట్బంధన్ ఏర్పడింది. ఈ కూటమి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పూర్నియాతో సహా రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాల్లో 26 స్థానాలను తమ అతిపెద్ద మిత్రపక్షమైన ఆర్జేడీకి కేటాయిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో, సీపీఐ (ఎంఎల్) 3 స్థానాల్లో, సీపీఐ, సీపీఎం ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి. ఏప్రిల్ 2న నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైన పప్పు యాదవ్ తాజగా ఏప్రిల్ 4న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు. పూర్ణియాకు సంబంధించి తన నిర్ణయాన్ని పునరాలోచించి ఆ సీటును కాంగ్రెస్‌కు ఇవ్వాలని ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్‌ను పప్పు యాదవ్ కోరారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్‌లో పేర్కొన్నారు. -
ఆ మాజీ సీఎం చెప్పారనే.. 60 ఏళ్ల వయసులో పెళ్లి!
‘‘లాలూజీ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాం. ఆ భార్యాభర్తలు మనస్పూర్తిగా ఆయన మమ్మల్ని ఆశీర్వదించారు.. అది చాలూ..’’ అంటూ సంతోషంగా మీడియా ముందు మాట్లాడారు 60 ఏళ్ల అశోక్ మహతో. ఈ వయసులో పెళ్లా.. దానికి లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి దిగ్గజ నేత ఆశీర్వాదం ఎందుకు అనుకుంటున్నారా?.. ఎన్నికలు వస్తున్నాయి కదా.. అందుకేనట! నవాదా జిల్లాకు చెందిన అశోక్ మహతో.. మాజీ గ్యాంగ్‌స్టర్. సంచలన కేసుల్లో 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి గతేడాదే విడుదలయ్యాడు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరాడు. అందుకోసం ముంగేర్ స్థానం ఎంచుకున్నాడు. ఇదే స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ, జేడీయూ నేత లాలన్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఎలాగూ.. ఆర్జేడీ మద్దతు ఉంది. టికెట్ దక్కే అవకాశం లేకపోలేదు. కానీ.. అన్నేళ్లు జైలు శిక్ష అనుభవించి రావడం, కొన్ని కేసులు పెండింగ్‌లో ఉండడంతో చట్టపరంగా సాధ్యం కావడం లేదు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలిశారు. ఇక్కడే లాలూ తన మార్క్ రాజకీయం చూపించారు. ‘వివాహం చేసుకుని నీ భార్యను పోటీ చేయించు’ అని లాలూ సలహా ఇచ్చారు. అంతే.. ఢిల్లీకి చెందిన కుమారి అనిత(46) అనే మహిళను మంగళవారం రాత్రి పాట్నా శివారులో ఉన్న ఓ గుడిలో కుటుంబ సభ్యులు, తన మద్దతుదారుల మధ్య పెళ్లి చేసుకున్నారు. బుధవారం ఉదయం ఆ నవవధువు, వరుడు లాలూ ఇంటికి వెళ్లారు. మాజీ సీఎం జంట లాలూ-రబ్రీదేవీల ఆశీర్వాదం తీసుకున్నారు. బయటకు వచ్చిన ఆయన వాహనాన్ని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి.. ఆర్జేడీ టికెట్ ఇస్తుందా? లాలూ హామీ ఇచ్చారా? మీ భార్యను ఎన్నికల బరిలో దింపబోతున్నారా?.. హడావిడిగా వివాహం చేసుకోవడానికి కారణాలేంటి?.. ఇలా ప్రశ్నలతో ఆ పెళ్లి కొడుకును ఉక్కిరి బిక్కిరి చేశారు. అయితే అశోక్ మాత్రం తెలివిగా ‘ ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా ఆర్జేడీ నుంచి పోటీ చేస్తాం’ అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ब्याह रचाने के बाद नई नवेली दुल्हन के साथ लालू का आशीर्वाद लेने पहुंचे कुख्यात अशोक महतो, टिकट के लिए 62 की उम्र में खरमास में रचाई है शादी#ASHOKMAHTO #BiharPolitics #Bihar #BiharNews pic.twitter.com/VqrEn1zeSb — FirstBiharJharkhand (@firstbiharnews) March 20, 2024 VIDEO Credits: FirstBiharJharkhand షేక్‌పురా జేడీయూ ఎమ్మెల్యే రణధీర్ కుమార్ సోనీపై హత్యాయత్నం ఆరోపణలతోపాటు నవాదా జైలు బద్దలుగొట్టిన కేసులో నేరస్థుడిగా అశోక్ మహతో 17ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. 2023లో జైలు నుంచి ఆయన విడుదలయ్యాడు. ఇక.. 1997లో దాణా కుంభకోణంలో లాలూ రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు తన భార్య రబ్రీదేవిని బీహార్‌కు ముఖ్యమంత్రిని చేసింది తెలిసిందే. -
లాలూతో పప్పు యాదవ్ భేటీ.. మాధేపురా సీటుకు వినతి!
బీహార్‌కు చెందిన మాజీ ఎంపీ పప్పు యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ యాదవ్, తేజస్వి యాదవ్‌లను కలుసుకున్నారు. ఆయన రాష్ట్రీయ జనతాదళ్ టిక్కెట్‌పై మాధేపురా నుండి పోటీచేయాలనే అభిలాషను వారి ముందు వ్యక్తం చేసినట్లు సమాచారం. పప్పు యాదవ్ 2014లో ఆర్జేడీ టిక్కెట్‌పై మాధేపురా నుంచి గెలుపొందారు. అందుకే ఈసారి కూడా పప్పు యాదవ్‌ను ఆర్జేడీ మాధేపురా అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలున్నాయి. కాగా సింగపూర్‌లో ఉంటున్న లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్యకు సారణ్ సీటు ఇచ్చే విషయమై పార్టీ పరిశీలిస్తోందని వినికిడి. లాలూ గతంలో సారణ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. రెండున్నరేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్-రాష్ట్రీయ జనతాదళ్‌ల ‘మహాకూటమి’ సీపీఐ (ఎంఎల్) లిబరేషన్‌తో పొత్తు పెట్టుకుని ఎన్డీఏకు గట్టి సవాల్ విసిరింది. అయితే రెండు నెలల క్రితం నితీష్ కుమార్ హఠాత్తుగా ఎన్డీఏలోకి రావడంతో ప్రస్తుతం పరిస్థితులు తారుమారయ్యాయి. బీహార్‌లో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19, జూన్ ఒకటి మధ్య ఏడు దశల్లో జరగనున్నాయి. -
తండ్రికి కిడ్నీదానం.. రాజకీయాల్లోకి మాజీ సీఎం కూతురు?
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె 'రోహిణి ఆచార్య' రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. బీహార్‌లోని సరన్ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు సమాచారం. యాదవ్ కుటుంబానికి సన్నిహితుడుగా పేరుగాంచిన బీహార్ శాసన మండలి సభ్యుడు సునీల్ కుమార్ సింగ్ సోషల్ మీడియా పోస్ట్ తర్వాత శ్రీమతి ఆచార్య రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2009లో లాలూ ప్రసాద్ యాదవ్ పోటీ చేసిన సరన్ ఎంపీ నియోజకవర్గం నుంచి రోహిణి పోటీ చేయబోతున్నారని చెబుతున్నారు. డాక్టర్ రోహిణి ఆచార్య తన తండ్రి పట్ల చూపించే ప్రేమ, భక్తి, అంకితభావానికి దాదాపు అందరికి తెలుసు. సరన్ ప్రాంతంలోని పార్టీ కార్యకర్తలు అందరూ ఆమెను సరన్‌కు పార్టీ లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించాలని కోరుకుంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈ నెల ప్రారంభంలో పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన ఆర్జేడీ ర్యాలీలో ఆచార్య కూడా పాల్గొన్నారు. సరన్ లోక్‌సభ స్థానం ప్రస్తుతం బీజేపీకి చెందిన రాజీవ్ ప్రతాప్ రూడీ చేతిలో ఉంది. దీనికి గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రాతినిధ్యం వహించారు. రోహిణి ఆచార్య ఎవరు? రోహిణి ఆచార్య వృత్తి రీత్యా ఎంబీబీఎస్ డాక్టర్. ఈమె 2002లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సమేష్ సింగ్‌ను వివాహం చేసుకుంది. ఇతడు లాలూ యాదవ్ స్నేహితుడైన.. రాయ్ రణవిజయ్ సింగ్ కుమారుడు. గత రెండు దశాబ్దాలుగా, శ్రీమతి ఆచార్య, ఆమె భర్త విదేశాల్లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీమతి ఆచార్య.. 2022లో అనారోగ్యంతో ఉన్న తన తండ్రికి కిడ్నీ దానం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ఆచార్య చేసిన పనికి ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రశంసించాయి. అంతకుముందు 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఊహించారు. కానీ అది జరగలేదు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019